Vivo V21e 5G: వివో నుంచి కొత్త 5జీ ఫోన్‌

Vivo V21e 5G: మనదేశంలో వివో వీ21ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు వివో ప్లాన్ చేస్తోంది.

Update: 2021-06-14 17:00 GMT

వివో వీ21ఈ (ఫొటో ట్విట్టర్)

Vivo V21e 5G: మనదేశంలో వివో వీ21ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు వివో ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఈ స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్, బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. దీంతో ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై పనిచేయనున్న ఈ ఫోన్‌లో.. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుందంట. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే.. ధర రూ.15 వేలలోపే ఉండనుందని తెలుస్తోంది.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 MP కాగా, దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందువైపు 32 MP కెమెరాతో రానుందని సమాచారం.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 400 mAh బ్యాటరీతో రానున్న ఈఫోన్ 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో అలరించనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News