UPI Transactions: మీరు గూగుల్ పే, ఫోన్‌ పే ఎక్కువగా వాడుతున్నారా? ఇక నుంచి రెట్టింపు స్పీడ్‌తో యుపీఐలు..

UPI Transactions: పట్నం నుంచి పల్లెటూళ్ల వరకు చదువుకున్నవాళ్ల నుంచి చదువులేని వాళ్లవరకు ఇప్పుడు అందరూ డిజిటల్ చెల్లింపులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Update: 2025-06-18 10:45 GMT

UPI Transactions: మీరు గూగుల్ పే, ఫోన్‌ పే ఎక్కువగా వాడుతున్నారా? ఇక నుంచి రెట్టింపు స్పీడ్‌తో యుపీఐలు..

UPI Transactions: పట్నం నుంచి పల్లెటూళ్ల వరకు చదువుకున్నవాళ్ల నుంచి చదువులేని వాళ్లవరకు ఇప్పుడు అందరూ డిజిటల్ చెల్లింపులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎంత చిన్న అమౌంట్ అయినా కూడా డిజిటిల్ పేమెంటే చేస్తున్నారు. ఇలా

కస్టమర్లు డిజిటల్ పేమెంట్స్ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో యూపిఐలను వాడేవారి సంఖ్య కూడా ఇలానే పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు యుపీఐలు ఉపయోగించేవారికి ప్రభుత్వం శుభవార్త వచ్చింది. యుపిఐ చెల్లింపులను మరింత వేగంగా, సమర్ధవంతంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

యూపీఐ చెల్లింపులు జూన్ 16నుంచి వేగంగా సాగాయని నిపుణులు తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాలతో వేగవంతమైన చెల్లింపులు సాధ్యమయ్యాయని చెప్పారు. బ్యాంకులు, చెల్లింపుల యాప్‌లతో సహా అన్ని యూపిఐ యాప్‌ల సమయాన్ని తగ్గించాలని ఆదేశించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కొత్త రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలు పూర్తి చేయడానికి పట్టే సమయం అంటే డబ్బు పంపడం, స్వీకరించడం వంటివి ఇప్పుడు కేవలం 15 సెకన్లలో జరిగిపోతుంది.

గతంలో ఈ యూపీఐ గరిష్ట సమయం 30 సెకన్లు ఉండేది. ఇప్పుడు దాన్ని 15 సెకన్లకు తగ్గించారు. ఈ తగ్గింపు సమయం గూగుల్ పే, ఫోన్ పేలకు మాత్రమే వర్తించదు. వాటితో పాటు పేటిఎమ్ వంటి పలు సంస్థలకు వర్తిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి క్యూర్ కోసం స్కాన్ చేశాక సంబంధిత బ్యాంక్ ఎన్‌పీసీఐ సిస్టమ్ ద్వారా మరో బ్యాంకునకు చెల్లింపు అభ్యర్ధనను పంపుతుంది. ఈ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందా? వంటి విషయాలు తనిఖీలు చేసి డబ్బు అందినట్లు నిర్ధారణను తిరిగి పంపుతుంది. ఈ నిర్ధారణ ఎన్ పీసీఐ సిస్టమ్ ద్వారా సబంధిత బ్యాంక్‌కు తిరగి పంపుతుంది. దీంతో మొబైల్ ట్రాన్స్ యాక్షన్ సక్సెస్ ఫుల్ అని వస్తుంది.

Tags:    

Similar News