Top Smartphones Launching In May 2025: ఈ నెలలో ఫోన్ల జాతర.. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయంటే..?

Top Smartphones Launching In May 2025: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. గతంలో కేవలం కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే ఫోన్లు వాడేవారు కానీ, ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అందరూ స్మార్ట్ ఫోన్స్ బాట పడుతున్నారు. నేడు స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఏమీ తోచదు అనే స్థితి ఏర్పడింది.

Update: 2025-05-01 10:25 GMT

Top Smartphones Launching In May 2025: ఈ నెలలో ఫోన్ల జాతర.. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయంటే..?

Top Smartphones Launching In May 2025: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. గతంలో కేవలం కాల్స్, మెసేజ్‌లకు మాత్రమే ఫోన్లు వాడేవారు కానీ, ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అందరూ స్మార్ట్ ఫోన్స్ బాట పడుతున్నారు. నేడు స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఏమీ తోచదు అనే స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు ప్రతి మే నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ నెలలో సరసమైన ధరతో పాటు బలమైన స్పెసిఫికేషన్‌లతో పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy S25 Edge

టెక్ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ ఈ నెలలో గెలాక్సీ S25 Edgeని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 163 గ్రాముల బరువు, 5.8మిమీ మందం ఉంటుంది. ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, టైటానియం ఫ్రేమ్ ఉంటాయని లీక్‌లు సూచిస్తున్నాయి. స్పెక్స్ పరంగా, 6.7-అంగుళాల LTPO అమోల్డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 3900mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటాయి.

OnePlus Nord CE 5

వన్‌ప్లస్ నార్డ్ CE 5ని కంపెనీ మే నెలలో విడుదల చేస్తుంది. దీనికి ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, ఫ్లాట్ ఫ్రేమ్ ఉండచ్చు. దీని డిజైన్‌లో iPhone 16ని పోలి ఉంటుంది. 6.7-అంగుళాల 1080p OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 7100mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఛార్జింగ్, డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉన్నాయి.

Motorola Razr Ultra, Razr 60

మోటరోలా మే నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫీచర్ల పరంగా ఇందులో 4-అంగుళాల పెద్ద 165Hz LTPO అమోల్డ్ కవర్ స్క్రీన్, 3.6-అంగుళాల 90Hz అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. డైమెన్సిటీ 7400X చిప్‌సెట్‌ ఉంటుంది. అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అందించారు.

Samsung Galaxy F56

అలాగే, సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే మధ్య లేదా చివరి నాటికి విడుదల చేయచ్చు. ఫీచర్ల విషయానికొస్తే, F56 5Gలో సామ్‌సంగ్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 6.74-అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. దీనిలో 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ ఉంటుంది. దీని ధర 25,000 నుండి 27,000 వరకు ఉండచ్చు.

iQOO Neo 10

ఈ నెలలో ఐకూ నియో 10 కూడా విడుదల కావచ్చు. ఇందులో 6.78-అంగుళాల 144Hz LTPO అమోలెడ్ డిస్‌ప్లే, ప్రీమియం డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, 6100mAh బ్యాటరీ ఉన్నాయి. అలానే 50MP కెమెరా, 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ ఉన్నాయి. దీని ధర రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News