Smart TVs: మార్కెట్లోకి ఇన్ని మంచి టీవీలా? వీటి ఫీచర్స్ చూస్తే మీరు షాకైపోతారు

Smart TVs: హై టెక్నాలజీ, కొత్త కొత్త ఫీచర్స్ తో ఇప్పుడు మార్కెట్లోకి కొత్త టీవీలు అందుబాటులోకి వచ్చేసాయ్.

Update: 2025-06-25 01:30 GMT

Smart TVs: మార్కెట్లోకి ఇన్ని మంచి టీవీలా? వీటి ఫీచర్స్ చూస్తే మీరు షాకైపోతారు

Smart TVs: వినోదం కావాలంటే ఇంట్లో కచ్చితంగా టీవీ ఉండాల్సిందే. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ ఈ టీవీ కావాలి. అందుకే చాలా మంది ఇళ్లలో రిమోట్ కోసం గొడవలు జరుగుతుంటాయి. దీని సంగతి పక్కన పెడితే టీవీ ఎక్కువగా చూసేవారికి ఒక గుడ్ న్యూస్.. హై టెక్నాలజీ, కొత్త కొత్త ఫీచర్స్ తో ఇప్పుడు మార్కెట్లోకి కొత్త టీవీలు అందుబాటులోకి వచ్చేసాయ్. మరి అవేంటో చూసేద్దామా..

స్మార్ట్ గూగుల్ టీవీ

టీవీలు అన్నింటిలో హైయర్ 55 అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ ముందుంటుంది. దీనిలోని హెచ్ డిఆర్ 10 , ఎంఈఎంసీ, డాల్ఫీ విజన్‌తో కూడిన అల్ట్రా హెచ్ డీ లెడ్ ప్యానల్‌తో స్ర్కీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టీవీ నెట్ ఫ్లెక్స్, డిస్నీ హాట్ స్టార్, సోలీ లివ్, యూట్యూబ్ వంటి చాలా యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టవిటీ కోసం నాలుగు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీలు, వైఫై, బ్యూటూత్, ఈథర్నెట్ ఇందులో ఉన్నాయి. బేస్ లెస్ మెటల్ డిజైన్ దీని ప్రత్యేకత అయితే 178 డిగ్రీల వ్యూ యాంగిల్ దీని స్పెషల్ అట్రాక్షన్.

4 కె అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ

ప్రముఖ కంపెనీ ఎల్ జీ నుంచి ఈ టీవీ విడుదలైంది. ఇందులో ఉన్నో స్పెషలాలిటీలు ఉన్నాయి. ఏ5 ఏఐ ప్రాసెసర్‌‌ 4కె జెన్ 6తో సినిమాలు, టీవీ షోలు చాలా క్లారిటీగా చూడొచ్చు. 1.5 జీబీ ర్యామ్, 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్, 2.0 సీహెచ్ స్పీకర్, వైఫ్ , మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, గేమ్ ఆప్టిమైజర్ వంటి వెన్నో ప్రత్యేకతలు ఈ టీవీలో ఉన్నాయి. ఈ టీవీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

పానాసోనిక్ ఎల్ ఈడీ టీవీ

ఇది 55 అంగుళాలు ఉంటుంది. దీనిలోని 4కె కలర్ ఇంజన్, హెక్సాక్రోమా డ్రైవ్, వైడ్ కలర్ గ్యామట్ లు స్పష్టమైన విజువల్స్ ని అందిస్తాయి. 178 డిగ్రీల వ్యూ యాంగిల్. గదిలో ఎక్కడ నుంచైనా ఈ టీవీ చూడొచ్చు. అంతేకాదు, పాపులర్ యాప్‌లకు సపోర్ట్‌ ని ఇవ్వడంతో పాటు గూగుల్ అసిస్టెంట్, స్ర్ర్ర్కీన్ మిర్రరింగ్, హెచ్ డీ ఎంఐ, యూఎస్ బీ పోర్టులు, వైఫై వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది కూడా అమెజాన్ లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News