Samsung Galaxy M55s: జాక్‌పాట్ డీల్.. సామ్‌సంగ్ నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. ఈ ఒక్క ఫీచర్ చాలు..!
Samsung Galaxy M55s: సామ్‌సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్Galaxy M55sని త్వరలో విడుదల చేయబోతోంది. దీని ఫీచర్లు, ధర లీక్ అయ్యాయి.
Samsung Galaxy M55s
Samsung Galaxy M55s: గ్లోబల్ టెక్ మేకర్ సామ్‌సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్Galaxy M55sని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిస్తూనే ఉంది. ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్ సోపోర్ట్ పేజీ సామ్‌సంగ్ ఇండియాలో లైవ్ అవుతుంది. ఇప్పుడు ఓ టెక్ వీరుడు ఈ ఫోన్ రియల్ టైమ్ ఫోటోలు, స్పెసిఫికేషన్లు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇవి మొబైల్ ప్రియులు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. గెలాక్సీ ఎమ్55ఎస్ ఫోన్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
షేర్ చేసిన ఫోటోను బట్టి కంపెనీ ఈ ఫోన్‌ను కొత్త ఫ్యూజన్ డిజైన్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫోటోను పరిశీలిస్తే ఫోన్‌లో త్రీ పార్ట్స్ డిజైన్‌ను ఉపయోగించినట్లు చూడవచ్చు. ఇది ఒక షైనింగ్ లుక్‌తో మధ్యలో ఒక స్ట్రిప్డ్ పార్ట్స్‌తో మాట్టే భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ డిజైన్ ఫోన్ కెమెరా మాడ్యూల్ నుండి క్రిందికి స్ప్రెడ్డై ఉంటుంది. టిప్‌స్టర్ షేర్ చేసిన ఫోటోలో మీరు ఫోన్ రెండు కలర్ వేరియంట్లను చూడొచ్చు. అందులో బ్లూ, బ్లాక్ ఉన్నాయి.
Samsung Galaxy M55s Features
నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో sAMOLED డిస్‌ప్లేను అందించబోతోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయగలదు. ఫోన్ 8 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో రావచ్చు. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 చిప్‌సెట్‌ని చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించగలదు.
ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఫోన్‌లో అందించబడిన మెయిన్ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో రావచ్చు. అదే సమయంలో కంపెనీ ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకురానుంది. ఫోన్ ఫీచర్ల గురించి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది Galaxy M55 లాగా ఉంటుంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.20 వేలు ఉంటుందని చెబుతున్నారు.