Samsung Galaxy Z Flip 6: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై బిగ్గెస్ట్ డిస్కౌంట్..!
Samsung Galaxy Z Flip 6: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.
Samsung Galaxy Z Flip 6: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6పై బిగ్గెస్ట్ డిస్కౌంట్..!
Samsung Galaxy Z Flip 6: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ తరుణంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన Year End Sale 2025తో స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు మంచి అవకాశాలు వచ్చాయి. ప్రీమియం నుంచి మిడ్‌రేంజ్ వరకు అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నవారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. రండి.. పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం. ఈ సేల్‌లో ఆకట్టుకునే డీల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఒకటి. ఈ ఫోన్‌పై రూ.38,000కు పైగా సేవింగ్ లభించే అవకాశం ఉంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండటంతో, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 లాంచ్ ధర రూ.1,09,999. అయితే ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా.. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.35,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధర నేరుగా రూ.74,999కి తగ్గింది. అంతేకాదు, Axis లేదా SBI క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే అదనంగా రూ.3,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
స్పెసిఫికేషన్స్ ఇలా..
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6లో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X మెయిన్ డిస్‌ప్లే ఉంది. ఇది FHD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. బయట భాగంలో 3.4 అంగుళాల సూపర్ AMOLED కవర్ స్క్రీన్ ఉంది, ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. బ్యాటరీగా 4,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సెక్షన్‌లో.. ఈ ఫోల్డబుల్ ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10MP కెమెరా అందుబాటులో ఉంది. అలాగే, ఆటో జూమ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఫ్రేమింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసి మెరుగైన ఫొటోలు తీయడంలో సహాయపడతాయి. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 ప్రస్తుతం ఒక మంచి ఎంపికగా కనిపిస్తోంది.