Samsung Galaxy S26: శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్!
2026లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కోరుకుంటున్న యూజర్లకు గుడ్ న్యూస్. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చే ఫిబ్రవరిలో లాంచ్ కానుందని సంస్థ అధికారికంగా తెలిపింది.
Samsung Galaxy S26: శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్!
Samsung Galaxy S26: 2026లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కోరుకుంటున్న యూజర్లకు గుడ్ న్యూస్. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చే ఫిబ్రవరిలో లాంచ్ కానుందని సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, లాంచ్‌కు ముందే ఈ ఫ్లాగ్‌షిప్ పోన్ల గురించి పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. దీనిలో భాగంగా డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్స్‌లో పలు ఫీచర్ల గురించి రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రీమియం గెలాక్సీ S26 సిరీస్‌కు సంబంధించి కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరిలో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ S26 లైనప్ పూర్తి ఓవర్‌హాల్ విధానంలో కాకుండా గత ఏడాదిలో వచ్చిన డిజైన్ మాదిరిగా కొన్ని అప్‌గ్రేడ్స్ ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే స్టాండర్డ్ Galaxy S26 మూడు లెన్స్‌లతో పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉండనుంది. అయితే, గెలాక్సీ S26 అల్ట్రా మెయిన్ కెమెరా ఐలాండ్ నుంచి కొన్ని లెన్స్ ఉండొచ్చు. ఈ మూడు మోడల్సూ ఫ్లాట్ రియర్ ప్యానెల్స్ ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌లతో వస్తాయని సమాచారం.
ఈ గెలాక్సీ S26 సిరీస్ అన్ని ఫోన్లలో ఎంపిక చేసిన మార్కెట్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 3nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. శాంసంగ్ ఈ ఫోన్‌లలో Android 8.5 ఆధారంగా వన్ యూఐ 16 ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉండొచ్చు. ఇకపోతే ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు కూడా అలానే ఉంటుందని సమాచారం. ఈ ఫోన్‌లో అల్ట్రా 6.9-అంగుళాల క్యూహెచ్‌డీ శాంసంగ్ M14 ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండవచ్చు.
ఇకపోతే స్టాండర్డ్ Galaxy S26 ఫోన్ 6.3-అంగుళాల క్యూహెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రావచ్చు. Samsung Galaxy S26 Plus దాదాపు ఒకే విధనమైన ఫీచర్లతో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. కెమెరా స్పెషిఫికేషన్లలో అల్ట్రా మోడల్ కూడా ఉంటుందని సమాచారం. Samsung Galaxy S26 Ultraలో 200MP ప్రైమరీ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ రావొచ్చని టెక్ వర్గాల్లో చర్చ. అలాగే దీనిలో 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫొటో లెన్స్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ కూడా ఉండవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు మోడళ్లలో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫొటో కెమెరా ఉండవచ్చని సమాచారం. తాజా లీక్స్ ప్రకారం.. Samsung Galaxy S26 సిరీస్ 2026, ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత మార్చి ప్రారంభంలోనే విక్రయాలు కూడా జరగొచ్చు. గత ఏడాది ధరలను పరిశీలిస్తే.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ. 80,999 నుంచి ప్రారంభమైంది. అలాగే గెలాక్సీ S25 ప్లస్ ధర రూ.99,999 వద్ద లాంచ్ అయింది. గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.129,999కు లిస్ట్ అయ్యింది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.