Vivo Camera Phone : వివో 200MP కెమెరా ఫోన్.. భారీగా డిస్కౌంట్.. ఆఫర్ జనవరి 31 వరకే..!
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో బ్రాండ్ లో స్పెషల్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ వివో X300 సిరీస్ ఫోన్లు ఉన్నాయి.
Vivo Camera Phone : వివో 200MP కెమెరా ఫోన్.. భారీగా డిస్కౌంట్.. ఆఫర్ జనవరి 31 వరకే..!
Vivo Camera Phone: ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో బ్రాండ్ లో స్పెషల్ కెమెరా ఫోన్లు ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ వివో X300 సిరీస్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ సిరీస్ కంటే అంతకుముందు వెర్షన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వివో X200 సిరీస్ ఫోన్ల హవా నడిచింది. X200 సిరీస్ లో హై ఎండ్ మోడల్ X200 ప్రో 5G చాలా పాపులర్. ఈ వివో X200 ప్రో ధర ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ భారీగా తగ్గింది.
ఈ ఫోన్‌లో అద్భుతమైన 200MP టెలిఫోటో కెమెరా ఉంది. ఈ ఆఫర్‌తో కొనుగోలుదారులు రూ.9,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే వాలిడ్ ఉంది. ఆ తరువాత ధర మళ్లీ పెరిగిపోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రీమియం ఫోన్‌ను మరింత సులభంగా సొంతం చేసుకోవచ్చు.
వివో X200 ప్రో 5G ధర, డిస్కౌంట్ ఆఫర్లు
అమెజాన్ ఇండియాలో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999గా లిస్ట్ అయింది. కస్టమర్లకు రూ.9,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర చాలా తగ్గుతుంది. అదనంగా రూ.4,749 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.44,450 వరకు ఆదా అవుతుంది. ఎక్స్‌ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లతో ఫోన్ మరింత అందుబాటు ధరలోకి వస్తుంది.
ప్రీమియం డిస్‌ప్లేలో అధిక బ్రైట్‌నెస్
వివో X200 ప్రోలో 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2800 x 1260 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్స్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ ఉండటంతో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిస్‌ప్లే ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఈ ఫోన్‌లో 16GB LPDDR5x ర్యామ్ ఉంది. మల్టీటాస్కింగ్, యాప్స్ త్వరగా ఓపెన్ అవుతాయి. 512GB UFS 4.0 స్టోరేజ్‌తో ఫోటోలు, వీడియోలు, యాప్స్ పుష్కలంగా సేవ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో బలమైన పెర్ఫామెన్స్ మంచి బ్యాటరీ సామర్థ్యం లభిస్తుంది.
వివో X200 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్. 50MP టెలిఫోటో, 200MP పవర్‌ఫుల్ టెలిఫోటో లెన్స్‌తో జూమ్ ఫోటోలు అద్భుతంగా వస్తాయి. పగలైనా, రాత్రి వేళ్ల తక్కువ లైట్‌లో కూడా స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు. సెల్ఫీలకు, విడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, పోర్ట్రెయిట్స్ చాలా బాగుంటాయి.
ఈ ఫోన్‌లో 6,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. రోజంతా సులభంగా ఉపయోగించవచ్చు. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా చార్జ్ అవుతుంది. హెవీ యూజర్లకు ఇది చాలా సౌకర్యవంతం. ఈ డిస్కౌంట్‌తో వివో X200 ప్రో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆప్షన్‌గా మారింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ కలిసి ఉన్నాయి. ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే. ఆసక్తి ఉన్నవారు త్వరగా కొనుగోలు చేయండి, గరిష్ఠ ఆదా పొందండి.