Samsung First Tri-Fold Smartphone: మూడు సార్లు మడతపెట్టొచ్చు.. సామ్‌సంగ్ మొట్టమొదటి ట్రై ఫోల్డ్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?
Samsung First Tri-Fold Smartphone: సామ్‌సంగ్ తన మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది కంపెనీ ఫోల్డబుల్ డివైస్ లైనప్‌లో కొత్త గ్యాడ్జెట్. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లేతో ఫోల్డబుల్ డివైస్‌పై పనిచేస్తున్నట్లు ధృవీకరించింది.
Samsung First Tri-Fold Smartphone: మూడు సార్లు మడతపెట్టొచ్చు.. సామ్‌సంగ్
మొట్టమొదటి ట్రై ఫోల్డ్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?
Samsung First Tri-Fold Smartphone: సామ్‌సంగ్ తన మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది, ఇది కంపెనీ ఫోల్డబుల్ డివైస్ లైనప్‌లో కొత్త గ్యాడ్జెట్. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లేతో ఫోల్డబుల్ డివైస్‌పై పనిచేస్తున్నట్లు ధృవీకరించింది. అయితే లాంచ్ టైమ్‌లైన్ లేదా స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎటువంటి వివరాలను నిర్ధారించలేదు. అధికారిక వివరాలు వెల్లడికానప్పటికీ, ఇటీవల కొంత సమాచారం లీక్ అయింది. డిస్‌ప్లే, డిజైన్, ముఖ్యమైన ఫీచర్లు గురించి తెలుసుకోవచ్చు.
Samsung First Tri-Fold Smartphone Features
సామ్‌సంగ్ తన మొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని భావిస్తున్నారు, దీనిని 'గెలాక్సీ జి ఫోల్డ్' పేరుతో మార్కెట్లోకి తీసుకురావచ్చు. సమాచారం ప్రకారం.. 9.9-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ సైజు హువావే మేట్ XT కంటే కొంచెం చిన్నది. ఇది ప్రపంచంచంలో మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అయిన 10.2-అంగుళాల ప్యానెల్‌ను అందిస్తుంది.
అయితే ఇందులో డ్యూయల్ ఇన్నర్-ఫోల్డింగ్ మెకానిజం ఉంటుంది. ఫోన్ ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు సేఫ్‌గా ఉంటుంది. ఇది మేట్ XT డిజైన్ కంటే విభిన్నంగా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ విషయానికి వస్తే, 23W- 24W మధ్య ఛార్జింగ్ స్పీడ్ అందిస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు అందించే ఫాస్ట్-ఛార్జింగ్ ఫీచర్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ, వీటిలో కొన్ని ఇప్పుడు 100W లేదా 120W, 200W వరకు స్పీడ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తున్నాయి.
Samsung First Tri-Fold Smartphone Price
సామ్‌సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మేట్ XT లాంచ్ ధర దాదాపు $2,800 (సుమారు రూ. 2,38,345). గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా మారే అవకాశం ఉంది.
Samsung First Tri-Fold Smartphone Launch Date
సామ్‌సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను 2026 ప్రారంభంలో విడుదల చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2025 చివరి నాటికి దీని పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మొబైల్ మొదట్లో చైనా, దక్షిణ కొరియా వంటి ఎంపిక చేసిన మార్కెట్లలో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురానున్నారు. కంపెనీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Galaxy G ఫోల్డ్ గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.