Realme GT 7 Pro Racing Edition: రియల్‌మి నుంచి రేసింగ్ ఎడిషన్.. ఫిబ్రవరి 13న లాంచ్..!
Realme GT 7 Pro Racing Edition: రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ 'Realme GT 7 Pro Racing Edition'ను త్వరలో తీసుకురానుంది.
Realme GT 7 Pro Racing Edition: రియల్‌మి నుంచి రేసింగ్ ఎడిషన్.. ఫిబ్రవరి 13న లాంచ్..!
Realme GT 7 Pro Racing Edition: రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ 'Realme GT 7 Pro Racing Edition'ను త్వరలో తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 13న అధికారికంగా మార్కెట్లోకి వస్తుంది. ఈ మొబైల్‌ను ముందుగా చైనాలో విడుదల చేయనున్నారు. ఈ నెలలోనే విక్రయాలు కూడా ప్రారంభమవుతాయి. అయితే రియల్‌మి ఈ స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని చెబుతున్నారు.
రియల్‌మి జీటీ7 ప్రో రేసింగ్ ఎడిషన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేయబడిన అత్యంత చౌకైన ఫోన్ ఇదే. 6,500mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ మొబైల్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రేసింగ్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఫిబ్రవరి 13న వెల్లడి కానున్నాయి. ఈ మొబైల్ రియల్‌మి జీటీ7కి సక్సెసర్‌గా వస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme GT 7 Pro Price
రియల్‌మి జీటీ 7 ప్రో ధర రూ. 59,999గా ఉంది. ఫోన్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 65,999కి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే కలర్స్‌లో కొనచ్చు.
Realme GT 7 Pro Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5k డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 2780 x 1264 పిక్సెల్స్ రిజల్యూషన్, ఎకో OLED ప్లస్ టెక్నాలజీతో వస్తుంది. అలానే ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఒరిజిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB RAM + 256GB, 16GB RAM + 512GB స్టోరేజ్ ఉంది.
ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అందులో OISతో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మి జీటీ7 ప్రో స్మార్ట్‌ఫోన్ 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్ 5.4 , NFC ఉన్నాయి.