Realme GT 7 Series: రియల్‌మి కొత్త ఫోన్లు. పవర్‌ఫుల్ ఫీచర్స్ రేంజే వేరు.. లాంచ్ ఎప్పుడంటే..?
రియల్‌మి GT 7 గత నెలలో చైనాలో లాంచ్ అయింది. ఇది త్వరలో భారత మార్కెట్‌లోకి రానుందని అధికారికంగా ప్రకటించింది.
Realme GT 7 Series: రియల్‌మి కొత్త ఫోన్లు. పవర్‌ఫుల్ ఫీచర్స్ రేంజే వేరు.. లాంచ్ ఎప్పుడంటే..?
Realme GT 7 Series: రియల్‌మి GT 7 గత నెలలో చైనాలో లాంచ్ అయింది. ఇది త్వరలో భారత మార్కెట్‌లోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను కంపెనీ షేర్ చేసింది. రియల్‌మి GT 7 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో మరొక మోడల్ రియల్‌మి GT 7T కూడా ఉండచ్చు. ఒక నివేదిక ప్రకారం.. రాబోయే రెండు రియల్‌మి ఫోన్‌లు కూడా ఒక సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించాయి.
Realme GT 7 Launch Date
రియల్‌మి ఇండియా తన ఎక్స్ పోస్ట్ ద్వారా దేశంలో రియల్‌మి GT 7 సిరీస్ లాంచ్‌ను టీజ్ చేసింది. దానితో పాటు "Never- Ending Power" అనే ట్యాగ్‌లైన్‌ను ఫోటోకు ఇచ్చింది. ఈ ఫోన్‌లో గేమర్స్ కోసం బెస్ట్ చిప్‌సెట్ అందించే అవకాశం ఉంది. అలానే పోస్ట్ ఫోన్ త్వరలో వస్తుందని చెబుతుంది. ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు.
అమెజాన్‌లో ఫోన్ లాంచ్ కోసం మైక్రోసైట్‌ను లైవ్ చేసింది. ఈ రియల్‌మి సిరీస్‌ను ప్రముఖ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ బ్యాటిల్ రాయల్ గేమ్ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) వెనుక ఉన్న డెవలపర్ క్రాఫ్టన్‌తో కలిసి పరీక్షించినట్లు చెబుతోంది. ఈ ఫోన్‌లు ఆరు గంటల వరకు 120 fps BGMI గేమ్‌ప్లేను అందిస్తాయని రియల్‌మి పేర్కొంది.
Realme GT 7 BIS
ఇంతలో రియల్‌మి GT 7 సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. లిస్టింగ్ ప్రకారం.. రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T వరుసగా RMX5061, RMX5085 మోడల్ నంబర్‌లతో రావచ్చు. ఇది భారతదేశంలో ఫోన్ల లాంచ్ గురించి సమాచారం అందిస్తుంది, కంపెనీ ఫ్లాగ్‌షిప్ గేమింగ్-సెంట్రిక్ లైనప్‌లో నవంబర్‌లో ప్రారంభమైన రియల్‌మి GT 7 Pro కూడా చేరుతుంది.
అయితే ఇండియా మోడల్ రియల్‌మి GT 7 చైనా వేరియంట్ కంటే కాస్త భిన్నంగా ఉండొచ్చు. దేశంలో విడుదలయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌పై రన్ అవుతుందని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ డిసెంబర్‌లో విడుదలైన రియల్‌మి నియో 7 రీబ్యాడ్జ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది.