Poco M7 Plus 5G: పోకో నుంచి సరికొత్త కొత్త వేరియంట్.. సెప్టెంబర్ 22న ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే..?

Poco M7 Plus 5G: పోకో ఆగస్టులో భారతదేశంలో 6జీబీ+ 8జీబీ ర్యామ్ వేరియంట్లలో Poco M7 Plus 5Gని విడుదల చేసింది.

Update: 2025-09-13 14:00 GMT

Poco M7 Plus 5G: పోకో నుంచి సరికొత్త కొత్త వేరియంట్.. సెప్టెంబర్ 22న ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే..?

Poco M7 Plus 5G: పోకో ఆగస్టులో భారతదేశంలో 6జీబీ+ 8జీబీ ర్యామ్ వేరియంట్లలో Poco M7 Plus 5Gని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన కొత్త 4GB RAM లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్, 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. కొత్త మోడల్ ఈ నెల చివరి నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

శుక్రవారం, కంపెనీ పోకో M7 ప్లస్ 5జీ 4GB 'లిమిటెడ్ ఎడిషన్' వేరియంట్ రాబోయే పండుగ సీజన్ సేల్‌లో అమ్మకానికి వస్తుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా సెప్టెంబర్ 23 నుండి ఈ సేల్ ప్రారంభమవుతుంది, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులు సెప్టెంబర్ 22 నుండి ముందస్తు యాక్సెస్ పొందుతారు.

ఆగస్టు నుండి అందుబాటులో ఉన్న 6జీబీ+ 8జీబీ ర్యామ్ వేరియంట్‌లతో పాటు పోకో M7 ప్లస్ 5జీ కొత్త 4జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. 6జీబీ+128జీబీ,8జీబీ+128జీబీ ర్యామ్ స్టోరేజ్ మోడళ్ల ధరలు వరుసగా రూ. 13,999, రూ. 14,999. కొత్త వేరియంట్ ధర ఇంకా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.

పోకో M7 ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 15-ఆధారంగా హైపర్ఓఎస్ 2.0 పై పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌గ్రేడ్లను పొందుతుంది. ఇందులో 144Hz వరకు రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.9-అంగుళాల ఫుల్‌‌హెచ్‌డీప్లస్ (1,080×2,340 పిక్సెల్స్) స్క్రీన్‌ ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది, 8జీబీ వరకు ర్యామ్, 128జీబీ UFS 2.2 నిల్వతో పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం AI-ఆధారిత డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు,వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ హ్యాండ్‌సెట్ IP64-రేటింగ్‌తో వస్తుంది, ఇది దుమ్ము, నీటి నుండి రక్షిస్తుంది.

కనెక్టివిటీ ఎంపికలలో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వైఫై, జీపీఎస్, యూఎస్‌బి టైప్-C పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. పవర్ కోసం 7,000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది, ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Tags:    

Similar News