OnePlus Turbo: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. 8,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చేస్తోంది..!
వన్‌ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్‌తో పాటుగా..
OnePlus Turbo: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. 8,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చేస్తోంది..!
OnePlus Turbo: వన్‌ప్లస్ సంస్థ ‘ప్యూర్ పర్ఫార్మెన్స్’ లక్ష్యంగా సరికొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus Ace 6 (OnePlus 15R) మోడల్స్‌తో పాటుగా.. ఇప్పుడు OnePlus Turbo పేరుతో ఒక అల్ట్రా-పవర్‌ఫుల్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ఈ OnePlus Turbo ఫోన్ అతిపెద్ద చెప్పుకోతగ్గ విషయం 8,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు ఏ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లోనూ లేనంత అతిపెద్ద బ్యాటరీ ఇదే కావడం విశేషం. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
ఇక ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రానుంది. క్వాల్‌కామ్ నుంచి త్వరలో విడుదల కానున్న ఈ చిప్, మొబైల్ గేమింగ్, పర్ఫార్మెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. థర్మల్స్‌ను సమర్థంగా నిర్వహించేందుకు “గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్”ను కూడా ఇందులో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ OnePlus Turbo 6.7 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్, అత్యధికమైన 165Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. OnePlus Turbo వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. ఇతర ఫీచర్లలో మెరుగైన హ్యాప్టిక్స్ (Haptics) కోసం X-యాక్సిస్ లీనియర్ మోటార్, స్టీరియో స్పీకర్లు, NFC, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. లీకైన రిపోర్ట్ ప్రకారం OnePlus Turbo హ్యాండ్‌సెట్‌ను వన్‌ప్లస్ ఇప్పటికే భారత్‌లో టెస్టింగ్ చేస్తోంది. కంపెనీ ప్రణాళికలు అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రెండు నెలల్లోనే ఈ ఫోన్ దేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై వన్‌ప్లస్ నుంచి అధికారిక లాంచ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.