OnePlus Pad Go: ట్యాబ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్ పాడ్ గో పై భారీ డిస్కౌంట్
OnePlus Pad Go: వనప్లస్ ప్యాడ్ గో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వైఫ్ సపోర్ట్ ట్యాబ్ పాత ధర రూ. 19,999కాగా ప్రస్తుతం ధర తగ్గిన తర్వాత రూ. 17,999కే లభిస్తోంది.
OnePlus Pad Go: ట్యాబ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్ పాడ్ గో పై భారీ డిస్కౌంట్
OnePlus Pad Go: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్, టీవీలపైతో పాటు మార్కెట్లోకి ట్యాబ్‌లను సైతం తీసుకొచ్చిన వియషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ గో పేరుతో ఓ ట్యాబ్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ను ప్రకటచింది. ఇంతకీ వన్‌ప్లస్ ప్యాడ్ గోకి సంబంధించి ఏయే వేరియంట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఈ ట్యాబ్ ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందం..
వనప్లస్ ప్యాడ్ గో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వైఫ్ సపోర్ట్ ట్యాబ్ పాత ధర రూ. 19,999కాగా ప్రస్తుతం ధర తగ్గిన తర్వాత రూ. 17,999కే లభిస్తోంది. ఇక మరో వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎల్‌టీఈ వేరియంట్ పాత ధర రూ. 21,999కాగా, ప్రస్తుతం ఈ ట్యాబ్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోచ్చు. ఇక మూడవ వేరియంట్ విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఎల్‌టీఈ పాత ధర రూ. 23,999కాగా, కొత్త ధర మాత్రం రూ. 21,999కే పొందొచ్చు.
అంటే ఈ లెక్కన ఈ ట్యాబ్లెట్స్‌పై ప్రతీ వేరియంట్‌పై కంపెనీ రూ. 2000 వరకు తగ్గించిదన్నమాట. అయితే ఈ డిస్కౌంట్స్ ఇక్కడితో ఆగిపోలేదు. ఐసీఐసీ బ్యాంక్ లేదా వన్ కార్డుకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 వరకు ఇన్‌స్టాంట్ తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ట్యాబ్లెట్‌పై ఏకంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచచన్నమాట. ఇదిలా ఉంటే వన్‌ప్లస్ ప్యాడ్ గో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.3 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.
4కే రిజల్యూషన్‌తో కూడిన ఈ స్క్రీన్‌లో 400 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్‌ను అందించారు. దీంతో ఈ ట్యాబ్‌ను సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూడచ్చు. బయటి కాంతికి అనుగుణంగా ఈ ట్యాబ్ స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ అవుతుంది. ఇక ఈ ట్యాబ్ మీడియాటెక్‌హీలియో జీ99 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB LPDDR4X RAM మరియు 256GB UFS 2.2 స్టోరేజ్, EIS సపోర్ట్‌తో ఈ ట్యాబ్ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు, అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమరాను ఇచ్చారు. 33 వాట్స్‌ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. డాల్బీ ఆటమ్స్ క్వాడ్ స్పీకర్‌లు ట్యాబ్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.