Motorola: మోటోరోల నుంచి లక్ష రూపాయల స్మార్ట్ ఫోన్.. సరికొత్త రంగులో..
Motorola: ఓవైపు బడ్జెట్ ధరతో పాటు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లను తీసుకొచ్చే మోటోరోలా తాజాగా ఓ ప్రీమియం ఫోన్‌ను తీసుకొచ్చింది.
Motorola: మోటోరోల నుంచి లక్ష రూపాయల స్మార్ట్ ఫోన్.. సరికొత్త రంగులో..
Motorola: ఓవైపు బడ్జెట్ ధరతో పాటు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లను తీసుకొచ్చే మోటోరోలా తాజాగా ఓ ప్రీమియం ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. కాగా ఈ ఫోన్‌ను కొత్త కలర్ ఆప్షన్‌లో తీసుకొచ్చారు. మోటరోలా రేజర్ 50 అల్ట్రాతో పాటు, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్‌ను కూడా కొత్త కలర్ ఆప్షన్‌లో తీసుకొస్తున్నారు.
పాంటోన్ కలర్ మొచ్చా మౌజ్ కలర్‌లో ఈ రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నెలలో కొత్త కలర్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక మొచ్చా మౌజ్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లను కేవలం కొన్ని గ్లోబల్ మార్కెట్స్‌లో మాత్రమే లభించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే భారత్‌లో ఈ ఫోన్ లభిస్తుందా.? లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మోటరోలా రేజర్ 50 అట్ట్రాల ఫోన్‌ను మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ కలర్‌లో తీసుకొచ్చారు. కాగా మోటరోలా ఎడ్జ్ 50 నియోను నాటికల్ బ్లూ, పయోంకియా, లాట్టే, గ్రిసైల్లె షేడ్స్‌లో తీసుకొచ్చారు.
ఫీచర్ల విషయానికొస్తే.. మోటరోలా రేజర్ 50 అల్ట్రాలో 6.9 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ మెయిన్ స్క్రీన్‌ను, 4 ఇంచెస్‌తో కూడిన ఔటర్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్‌జెన్ ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో 45 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిచారు. కెమెరాపరంగా చూస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడిన ఫ్లాట్ ఎల్టీపీఓ పోలెడ్ డిస్ ప్లేను అందంచారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. 68 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4310 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ర. 23,999గా నిర్ణయించారు.