Motorola Edge 60 Pro: మోటోరోలా కొత్త ఫోన్.. పెద్ద డిస్కౌంట్.. చాలా ఆకర్షణీయమైన డీల్..!
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా 2025లో కొత్తగా లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ పెద్ద డిస్కౌంట్ ప్రకటించి.
Motorola Edge 60 Pro: మోటోరోలా కొత్త ఫోన్.. పెద్ద డిస్కౌంట్.. చాలా ఆకర్షణీయమైన డీల్..!
Motorola Edge 60 Pro: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా 2025లో కొత్తగా లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ పెద్ద డిస్కౌంట్ ప్రకటించి. ఈ తగ్గింపుతో ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చింది. ఈ డీల్ మోటోరోలా అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో నుంచి ఇప్పటి వరకు కంపెనీ స్వయంగా ఈ ఫోన్ పై ధర తగ్గించలేదు. కానీ ఇప్పుడు మోటోరోలా గణనీయమైన ధర తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డివైస్‌ను ప్రస్తుతం బెస్ట్ ప్రీమియం డీల్స్‌లో ఒకటిగా మార్చింది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఒరిజినల్ ధర రూ.36,999. మోటోరోలా ఇప్పుడు ఫోన్‌పై డైరెక్ట్ 19 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఫోన్ రూ.29,999కే అందుబాటులో ఉంది. ఈ ధర తగ్గింపు మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే వర్తిస్తుంది. అయితే సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్లతో ధర మరింత తగ్గవచ్చు. IDFC క్రెడిట్ కార్డ్ EMI కొనుగోళ్లపై అదనపు రూ.2,500 డిస్కౌంట్ ఇస్తోంది. ఈ అదనపు ఆఫర్‌తో మొత్తం డిస్కౌంట్ దాదాపు రూ.9,500కి చేరుతుంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుదారులకు ఇది చాలా ఆకర్షణీయమైన డీల్.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌చేంజ్ చేసి అదనపు సేవింగ్స్ పొందవచ్చు. ఎక్స్‌చేంజ్ వాల్యూ ఫోన్ మోడల్, కండిషన్ బట్టి ఉంటుంది. లిస్టింగ్ ప్రకారం.. ఎలిజిబుల్ కస్టమర్లు రూ.22,499 వరకు సేవ్ చేయవచ్చు. ఈ ధరలో ఎడ్జ్ 60 ప్రో అతి చౌకైన ప్రీమియం ఫోన్‌లలో ఒకటిగా మారుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో పెద్ద 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. షార్ప్ 1.5K స్క్రీన్ రిజల్యూషన్ మెరుగైన విజువల్ క్లారిటీ ఇస్తుంది. డిస్‌ప్లే.. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఇందులో 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ జోడించింది. అవుట్‌డోర్ వెళ్లినప్పుడు అంటే ఎండలో, HDR కంటెంట్ షూట్ చేసేందుకు ఈ ఫోన్ ఐడియల్. డిజైన్ ప్రీమియం లుక్ ఇస్తుంది, చేత్తో పట్టుకున్నప్పుడు సాలిడ్‌గా అనిపిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ పవర్ ఎఫిషియెంట్ 4nm మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ వినియోగిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బలమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. ఈ ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. మోటోరోలా ఇందులో క్లీన్, నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్మూత్ పనితీరు, ఫాస్ట్ యాప్ లాంచెస్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. హెవీ యూజ్ చేసే వారికి కూడా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా నడుస్తుంది. ఫోన్ 90W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15W వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది. ఈ ఫీచర్లు రోజువారీ యూజర్లకు మంచి సౌలభ్యానిస్తాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో వెర్సటైల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫోన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. 10MP 3x టెలిఫోటో లెన్స్ రియర్ సెటప్ పూర్తి చేస్తుంది. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరా వీడియో కాల్స్, సోషల్ మీడియా కంటెంట్ షూట్ చేయడానికి బాగుటుంది. ఫోన్ 5G, డ్యూయల్ 4G VoLTE కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6E బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉన్నాయి. GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఇతర ఫీచర్లు. మోటోరోలా IP68, IP69 రేటింగ్స్ జోడించింది. వాటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఇప్పుడు అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ ఇస్తుంది. భారీ డిస్కౌంట్ తో ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ని బలమైన ఆప్షన్‌గా మార్చింది.