Motorola Edge 60 Fusion: వచ్చేస్తుంది ఇండియా.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్.. సూపర్ ఫోన్ ఇది..!

Motorola Edge 60 Fusion: భారత్‌లోని ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన రాబోయే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Update: 2025-03-24 07:27 GMT

Motorola Edge 60 Fusion: వచ్చేస్తుంది ఇండియా.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్.. సూపర్ ఫోన్ ఇది..!

Motorola Edge 60 Fusion: భారత్‌లోని ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా తన రాబోయే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ఇప్పటికే తన మైక్రోసైట్ పేజీని ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రస్తుతం కంపెనీ దీని గురించి ఎటువంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు, కానీ లుక్, డిజైన్ ఆధారంగా స్మార్ట్‌ఫోన్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో ట్రిపుల్ కెమెరా సెటప్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Motorola Edge 60 Fusion Price And Offers

రాబోయే ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అంచనా ధర, ఆఫర్ల విషయానికి వస్తే కంపెనీ దీనిని మీడియా లైనప్‌లో పరిచయం చేయచ్చు. దీని ప్రారంభ 6జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ ధర దాదాపు రూ.19,999. దాని ఇతర 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్‌ని దాదాపు రూ. 21,999కి విడుదల చేయచ్చు.మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అలానే బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

Motorola Edge 60 Fusion Features

సమచారం ప్రకారం.. ఈ ఫోన్ దేశంలో ఏప్రిల్ 2న విడుదల కావచ్చు. మొదటి సేల్ ఏప్రిల్ 9 నుండి ప్రారంభమవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 50MP మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5,500mAh బ్యాటరీ ఉంటుంది. మోటరోలా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఫోన్ గత సంవత్సరం మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి సక్సెసర్‌గా రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News