Motorola Edge 50 Pro: స్పెషల్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్..!

బడ్జెట్‌లో హై రేంజ్ పెర్ఫార్మెన్స్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసమే.

Update: 2026-01-04 12:30 GMT

Motorola Edge 50 Pro: స్పెషల్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్..!

Motorola Edge 50 Pro: బడ్జెట్‌లో హై రేంజ్ పెర్ఫార్మెన్స్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసమే. గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై గణనీయంగా ధర తగ్గింది. ఇప్పుడీ ఫోన్ అమెజాన్‌లో రూ.12,000 కంటే భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.

Motorola Edge 50 Pro పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. 125W ఛార్జింగ్‌, ఆకర్షణీయమైన కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌లో బెస్ట్ ఆప్షన్ ఇదే. మీరు గనుక ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. త్వరగా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 12GB + 256GB వేరియంట్ రూ.35,999 ధరలో విడుదల అయ్యింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మోడల్ రూ.23,985కు లిస్ట్ అయ్యింది. అంటే.. ఏకంగా రూ.12,014 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దీని మీద ఇంకా ఎక్కువ తగ్గింపు పొందాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

ఈ Motorola Edge 50 Pro హ్యాండ్ సెట్.. 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ HDR10+ సపోర్టును అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్, 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 125W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 4,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌‌తో లభిస్తుంది. దీనిలో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా‌ వైడ్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫొటో కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Tags:    

Similar News