Malware: వామ్మో మొబైల్‌లో మల్వేర్.. అప్రమత్తంగా ఉన్నారో..క్షణాల్లో అకౌంట్ ఖాళీ

Malware: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వినియోగదారులంతా జర అలర్ట్‌గా ఉండాలి. ఈ మధ్య వచ్చిన సైబర్ క్రైమ్ మాల్వేర్‌‌తో ఎంతోమంది తీవ్రనష్టాన్ని ఎదుర్కుంటున్నారు. అందుకే ఫోన్‌ని ఉపయోగించేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Update: 2025-06-25 15:59 GMT

Malware: వామ్మో మొబైల్‌లో మల్వేర్.. అప్రమత్తంగా ఉన్నారో..క్షణాల్లో అకౌంట్ ఖాళీ

Malware: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వినియోగదారులంతా జర అలర్ట్‌గా ఉండాలి. ఈ మధ్య వచ్చిన సైబర్ క్రైమ్ మాల్వేర్‌‌తో ఎంతోమంది తీవ్రనష్టాన్ని ఎదుర్కుంటున్నారు. అందుకే ఫోన్‌ని ఉపయోగించేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక చిన్న పొరపాటు.. మీ అకౌంట్‌లో డబ్బులన్నీ ఖాళీ అయిపోవచ్చు. హ్యాకర్లు డేటాను దొంగిలించడానికి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడానికి మాల్వేర్‌‌ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త మాల్వేర్ వచ్చింది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్లు భయపడిపోతున్నారు. దాని పేరు గాడ్ ఫాదర్ మాల్వేర్.

నిజంగా గాడ్ ఫాదర్‌‌లాంటిదే ఈ మాల్వేర్. కానీ వెరీ డేంజర్. ఇది గతంలో వచ్చిన మాల్వేర్ కంటే చాలా ప్రమాదకరం. ఈ మాల్వేర్ ఏం చేస్తుందంటే మీ మొబైల్ స్ర్కీన్‌ని మరొక డూప్లికేట్ స్క్రీన్‌ని సృష్టించగలదు. అదేవిధంగా మీ డివైజ్‌ను కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటుంది. అంటే మాల్వేర్ మీ ఫోన్‌లో హోస్ట్ ఫైల్‌ను ఇన్ స్టాల్ చేస్తుందన్నమాట. దీనివల్ల మీరు అసలు ఏది? నకలి ఏది? అన్నది గుర్తించలేరు. మీకే కాదు కొన్నిసార్లు యాంటీ వైరస్ యాప్‌కి కూడా గుర్తించడం సాధ్యం కాదు.

మీరు యాప్‌ను తెరిచిన వెంటనే మాల్వేర్‌‌ని మిమ్మల్ని వర్చువల్ వెర్షన్‌కు తీసుకెళుతుంది. దీని ఇంటర్ ఫేస్ అచ్చం నిజమైన యాప్‌లానే ఉంటుంది. ఇక అప్పటి నుంచి మొదలు. మాల్వేర్ మీరు మొబైల్‌లో చేసే ప్రతి పనితీరును పరిశీలిస్తుంది. ఇక అసలు కథ అప్పుడు మొదలవుతుంది. మీరు ఆపరేట్ చేసే మీ బ్యాంక్ వివరాలు, బ్యాంకింగ్ మెసేజ్‌లన్నింటినీ మాల్వేర్ చాలా జాగ్రత్తగా దొంగిలిస్తుంది. ఆ తర్వాత మీకు తెలియకుండా మీ డబ్బు మొత్తం వేరొక అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ అయిపోతాయి.

ఇది ప్రస్తుతం టర్కీలో చాలా ప్రమాదకరంగా ఉంది. దాదాపు 500 యాప్‌లను ఇది ప్రభావితం చేస్తోంది. అయితే ఇది వేరే ఇతర దేశాలకు వ్యాపించడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే అందరూ జర భద్రంగా ఉండాలి.

ఎలా మాల్వేర్ నుంచి బయటపడాలి?

మీరు ఏ యాప్ డౌన్ లోడ్ చేయాలన్నా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేయాలి.

మరేవిధంగానూ యాప్‌లను డౌన్ లోడ్ చేయకుండా సెట్టింగ్స్ చేసుకోండి.

ఎటువంటి మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినా అందులో ఏ లింక్స్‌ ని క్లిక్ చేయకూడదు. అలా చేస్తే మీరు ఆటోమేటిక్‌గా మాల్వేర్ మోసంలోకి వెళ్లిపోయినట్లే.

Similar News