Lenovo Xiaoxin Pad Pro 2021: సూపర్ ఫీచర్లతో రానున్న లెనోవా ట్యాబ్లెట్

Lenovo Xiaoxin Pad Pro 2021: లెనోవో కంపెనీ చైనాలో తన కొత్త ప్రీమియం ట్యాబ్లెట్‌లను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

Update: 2021-05-09 11:40 GMT

లెనోవా కొత్త ట్యాబ్లెట్ (ఫొటో ట్విట్టర్)

Lenovo Xiaoxin Pad Pro 2021: లెనోవో కంపెనీ చైనాలో తన కొత్త ప్రీమియం ట్యాబ్లెట్‌లను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు లెనోవా ఆ టాబ్లెట్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టాబ్లెట్ పనిచేస్తుందని తెలుస్తోంది. ఆ నెలలోనే మార్కెట్ లోకి విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ ట్యాబ్లెట్‌కు షియోక్సిన్ ప్యాడ్ ప్రో 2021 అని పేరు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కొత్త ట్యాబ్లెట్‌లో 90 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 2.5కే రిజల్యూషన్ తో ఈ టాబ్లెట్ రానుంది. ఇందులో పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గా ఉండనున్నాయి. ఈ డిస్‌ప్లేలో టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, హెచ్‌డీఆర్, డాల్బీ విజన్ ఫీచర్లు కూడా అందించారు.

ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ ఉండనుందని సమాచారం. ఏఆర్ఎం ప్రాసెసర్ల కోసం మార్పులు చేసిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఇప్పటికే ఈ ట్యాబ్లెట్ ఫొటోలు కూడా లీకయ్యాయి. ఇది చూసేందుకు ఐప్యాడ్ ప్రో తరహాలో ఉంది.

ముందువైపు కెమెరాను ట్యాబ్లెట్ పైభాగంలో ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. క్వాడ్ స్పీకర్ సపోర్ట్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం. మైక్రో ఎస్‌డీ కార్డు సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా ఈ ట్యాబ్లెట్ లో అందించారు. పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారని తెలుస్తోంది.

Tags:    

Similar News