Jio New Year 2026 Plans: జియో న్యూ ఇయర్ 2026 ఆఫర్లు.. మొబైల్ ప్లాన్‌తో పాటు 'గూగుల్ జెమిని ప్రో' ఉచితం!

Jio New Year 2026 Plans: ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏమిటంటే కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఆధునిక ఏఐ (AI) సేవలను కూడా ఉచితంగా అందించడం.

Update: 2025-12-28 12:30 GMT

Jio New Year 2026 Plans: జియో న్యూ ఇయర్ 2026 ఆఫర్లు.. మొబైల్ ప్లాన్‌తో పాటు 'గూగుల్ జెమిని ప్రో' ఉచితం!

Jio New Year 2026 Plans: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రిలయన్స్ జియో తన వినియోగదారులకు అదిరిపోయే కానుక ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏమిటంటే కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఆధునిక ఏఐ (AI) సేవలను కూడా ఉచితంగా అందించడం.

టెక్నాలజీని సామాన్య వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త ఆఫర్లను డిజైన్ చేసినట్లు జియో తెలిపింది.

జెమిని ప్రో ఏఐ ఉచిత యాక్సెస్

జియో విడుదల చేసిన ప్రధాన ప్లాన్‌లు ఇవీ 

రూ.3,599 ‘హీరో యాన్యువల్ ప్లాన్’

365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G సేవలతో పాటు 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

రూ.500 ‘సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్’

28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, 12కి పైగా ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 18 నెలల జెమిని ప్రో యాక్సెస్.

రూ.103 ‘ఫ్లెక్సీ ప్యాక్’

28 రోజుల పాటు అదనంగా 5GB డేటా అందిస్తుంది.

ప్లాన్లు ఎక్కడ లభిస్తాయి?

ఈ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు —

జియో అధికారిక వెబ్‌సైట్, MyJio యాప్, లేదా సమీపంలోని అధీకృత జియో రిటైల్ స్టోర్లలో రీఛార్జ్ చేసుకోవచ్చు.

టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న వేళ జియో కేవలం డేటానే కాకుండా ఏఐ, ఓటీటీ సేవలను కలిపి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. టెక్ ప్రియులకు, సినిమా ప్రేమికులకు ఈ ప్లాన్‌లు నిజంగా న్యూ ఇయర్ గిఫ్ట్ లాంటివేనని చెప్పొచ్చు. 

Tags:    

Similar News