iQOO Z10 And iQOO Z10x Launched: ఐకూ కొత్త ఫోన్లు అదుర్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా చాలా తక్కువే!

iQOO Z10 And iQOO Z10x Launched: టెక్ బ్రాండ్ ఐకూ శుక్రవారం తన Z సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది.

Update: 2025-04-11 09:29 GMT

iQOO Z10 And iQOO Z10x Launched: ఐకూ కొత్త ఫోన్లు అదుర్స్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా చాలా తక్కువే!

iQOO Z10 And iQOO Z10x Launched: టెక్ బ్రాండ్ ఐకూ శుక్రవారం తన Z సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. iQOO Z10, iQOO Z10x. వివో సబ్ బ్రాండ్ కొత్త ఫోన్లు రెండు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఐకూ Z10 స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్, ఐకూ Z10x మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. బేస్ మోడల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీతో వస్తుంది, అయితే ఐకూ Z10xలో 6,500mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతాయి. 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీల కోసం, రెండింటిలోనూ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

QOO Z10 Price

ఐకూ Z10 8GB + 128GB మోడల్ ధర రూ.21,999. 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్ల ధర వరుసగా రూ.23,999, రూ.25,999గా ఉంచారు. ఈ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధర రూ.19,999కి చేరుకుంటుంది.

QOO Z10x Price

ఐకూ Z10x 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. 8GB + 128GB, 8GB + 256GB మోడళ్ల ధర వరుసగా రూ.14,999, రూ.16,499. ఇది అల్ట్రామెరైన్, టైటానియం కలర్ ఆప్షన్లలో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 12,499 వరకు ఉండచ్చు. రెండు ఫోన్‌ల సేల్ ఏప్రిల్ 16 నుండి అమెజాన్, ఐకూ ఇండియా స్టోర్ ద్వారా ప్రారంభమవుతుంది.

iQOO Z10 Features And Specifications

ఐకూ Z10 5G డ్యూయల్-సిమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15లో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 387ppi పిక్సెల్ డెన్సిటీతో 6.77-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్, అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కెమెరా విభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది.

iQOO Z10 Battery

ఐకూ Z10లో 7,300mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం మొబైల్‌లో 5G, వైఫై, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.2, గెలీలియో, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.అలానే యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి.

iQOO Z10x Features And Specifications

ఐకూ Z10xలో కూడా Z10 మోడల్ లాగానే సిమ్, సాఫ్ట్‌వేర్, సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కెమెరా విషయానికి వస్తే ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ బోకె సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ కూడా ఉంది. సెన్సార్ల పరంగా ఇది స్టాండర్డ్ వేరియంట్ లాగానే ఉంటుంది.

iQOO Z10x Battery

ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, వైఫై 6 ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP64 రేటింగ్‌ బిల్డ్‌తో వస్తుంది.

Tags:    

Similar News