iQoo Neo 10R Big Price Drop: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది.. ఐకూ నియో 10R ధర భారీగా తగ్గింది..!

iQoo Neo 10R Big Price Drop: ఐకూ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. కొత్త గేమింగ్ ఫోన్ దాని లాంచ్ ధర కంటే తక్కువకు లభిస్తుంది.

Update: 2025-05-04 10:00 GMT

iQoo Neo 10R Big Price Drop: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది.. ఐకూ నియో 10R ధర భారీగా తగ్గింది..!

iQoo Neo 10R Big Price Drop: ఐకూ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. కొత్త గేమింగ్ ఫోన్ దాని లాంచ్ ధర కంటే తక్కువకు లభిస్తుంది. అమెజాన్‌ గ్రేట్ సమ్మర్ సేల్ iQOO Neo 10R కొనుగోలుపై భారీ తగ్గింపు అందిస్తుంది. అదనంగా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను పొందచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ బుక్ చేసుకుంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

iQoo Neo 10R Offers

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ టైటానియం, ర్యాగింగ్ బ్లూ కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26,999. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఈ ఫోన్ ధర రూ.24,999కి తగ్గింది. అదనంగా రూ. 2000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలానే రూ.2000 కూపన్ డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.4000 తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులపై తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తున్నారు. మీరు అదే కార్డును ఉపయోగించి EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే, మీకు రూ2,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iQoo Neo 10R Features

ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 2800 × 1260 పిక్సెల్‌ల రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. మొబైల్‌ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గ్రాఫిక్స్ కోసం అడ్రినో 735 GPU కూడా ఉంది.

ఐకూ నియో 10R ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. దీనికి 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న భారతదేశంలో అత్యంత సన్నని మొబైల్ ఇదే. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.

Tags:    

Similar News