Intel Layoffs: ఇంటెల్‌లో 25,000 ఉద్యోగులకు షాక్.. భారీ స్థాయిలో ఉద్యోగాల కోత
టెక్ రంగంలో మరోసారి భారీ కుదుపు రానుంది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది.
Intel Layoffs: ఇంటెల్‌లో 25,000 ఉద్యోగులకు షాక్.. భారీ స్థాయిలో ఉద్యోగాల కోత
టెక్ రంగంలో మరోసారి భారీ కుదుపు రానుంది. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2025 చివరి నాటికి ఇంటెల్ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని నిర్ణయించుకుంది. గతేడాది చివరికి కంపెనీలో 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇప్పటికే పెద్దఎత్తున తొలగింపులు
2025 ఏప్రిల్ నుంచి ఇంటెల్ దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను, అంటే 15,000 మందికి పైగా తొలగించింది. గతేడాది కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఇంటెల్ ఈ సరికొత్త లేఆఫ్స్‌ను ధృవీకరించింది.
సీఈఓ వ్యాఖ్యలు
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్ బు టాన్ మాట్లాడుతూ, కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో జర్మనీ, పోలాండ్‌లో నిర్మించాలనుకున్న కొత్త ఫ్యాక్టరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలకు మార్చనున్నట్లు తెలిపారు. దీని ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యం అని ఆయన చెప్పారు.
మార్కెట్‌లో ఇంటెల్ పరిస్థితి
ఒకప్పుడు మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన ఇంటెల్, స్మార్ట్‌ఫోన్ యుగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు వేగంగా ఎదుగుతుండగా, ఏఐ చిప్ సెట్ విభాగంలో ఇంటెల్ వెనకబడి ఉంది.