Motorola Edge 50 Ultra Discounts: భారీ ఆఫర్.. మోటో ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ డీల్స్ అదిరాయ్..!
Motorola Edge 50 Ultra Discounts: భారీ ఆఫర్.. మోటో ఫోన్‌పై రూ.18 వేల డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ డీల్స్ అదిరాయ్..!
Motorola Edge 50 Ultra Discounts: మోటరోలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. మీరు తక్కువ ధరకు బలమైన పనితీరు కలిగిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే సరైన సమయం. మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 18000 భారీ తగ్గింపును పొందుతోంది. ఈ మోటరోలా ఫోన్‌పై ఈ తగ్గింపు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Motorola Edge 50 Ultra Flipkart Deal
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ. 59,999 ప్రారంభ ధరకు విడుదల చేశారు. ప్రస్తుతం, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 44,999కి జాబితా చేశారు. అంటే, ఈ ఫోన్ పై రూ.15,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనితో పాటు, మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో చెల్లిస్తే, రూ.3000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విధంగా, మొత్తం రూ.18 వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనితో పాటు, మీరు పాత ఫోన్ ను మార్చుకుంటే, మీరు అదనపు డిస్కౌంట్ పొందచ్చు.
Motorola Edge 50 Ultra Specifications
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ 1.5K pOLED డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 144Hz, పీక్ బ్రైట్ నెస్ 2,500 నిట్స్. ఈ మోటరోలా స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 చిప్ సెట్ ఉంది.
ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే, మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ , 64MP టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు, ఇది 3x జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 4500 mAh బ్యాటరీ ఉంది. 125W ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.