Nokia Smartphones: నేడు 6 ఫోన్లను విడుదల చేయనున్న హెచ్‌ఎండీ గ్లోబల్

Nokia Smartphones: హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ రోజు 6 కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది.

Update: 2021-04-08 10:20 GMT

నోకియా నూతన ఫోన్లు (ఫొటో: ది హన్స్ ఇండియా)

Nokia Smartphones: హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ రోజు 6 కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:30 గంటలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, హెచ్‌ఎండీ గ్లోబల్ ఏ ఫోన్లను రిలీజ్ చేస్తుందో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ రాబోయే నోకియా ఫోన్‌లపై లీక్‌లు, పుకార్లు చాలానే వచ్చాయి. నోకియా స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో నోకియా ఎక్స్ 10, ఎక్స్ 20, సీ 20, జీ 20, జీ 10 విడుదల చేయనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నోకియా సీ 20 ఫోన్ ఇటీవల బ్లూటూత్ సిగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇది 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 తో పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.


నోకియా జీ 20, జీ 10 సిరీస్ లో కొత్త ఫోన్ గా చెప్పుకుంటున్నారు. నోకియా జీ 10 మీడియాటెక్ యొక్క హీలియో పీ 22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 తో పనిచేయనుంది. ఇది 6.4-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ తో రానుంది.

నోకియా జీ 20 మీడియాటెక్ హీలియో జీ 35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌లో నడుస్తుందని భావిస్తున్నారు. నోకియా జీ 20, జీ 10 లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్న నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. రెండు ఫోన్‌లలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అలాగే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండవచ్చని భావిస్తున్నారు.

నోకియా ఎక్స్ 10, ఎక్స్ 20 క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో 5 జీ స్మార్ట్‌ఫోన్‌లుగా రానున్నట్లు సమాచారం. నోకియా ఎక్స్ 20 లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్, 10W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 4,500 mAh బ్యాటరీ ఉండవచ్చని టాక్.

Tags:    

Similar News