Samsung Galaxy S24 FE: అదిరే ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల డిస్కౌంట్..!
Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ తన గెలాక్సీ S24 FEపై భారీ ఆఫర్ ప్రకటించింది. లాంచ్ ధర కంటే రూ.15000 తక్కువకే ఈ స్మార్ట్‌ఫొన్ ఆర్డర్ చేయచ్చు. Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Samsung Galaxy S24 FE: అదిరే ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల డిస్కౌంట్..!
Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ తన గెలాక్సీ S24 FEపై భారీ ఆఫర్ ప్రకటించింది. లాంచ్ ధర కంటే రూ.15000 తక్కువకే ఈ స్మార్ట్‌ఫొన్ ఆర్డర్ చేయచ్చు. Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. S24 FE కంపెనీ టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ బేస్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 FE Offers
సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,999కి లాంచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 డిస్కౌంట్ అందిస్తుంది. సేల్‌లో ఈ ఫోన్ 128GB బేస్ మోడల్ ధర రూ.44,999గా ఉంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ.2,100 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 అదనపు కూపన్ డిస్కౌంట్ ఇస్తుంది. ఓవరాల్‌గా రూ.20,100 భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ని మింట్, గ్రాఫైట్, బ్లూ కలర్స్‌లో ఆర్డర్ చేయచ్చు.
Samsung Galaxy S24 FE Features
సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఫోన్‌లో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ Exynos 2400e ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా One UI 6.1 OSలో పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Samsung Xclipse 940 GPUని కూడా అందించింది. ఈ ఫోన్‌లో 8GB RAM, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ మూడవ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్ 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 4700mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అంతే కాకుండా డస్ట్, వాటర్ ప్రొటక్ట్ చేయడానికి IP68 రేటింగ్ ఇచ్చారు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB C ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఉన్నాయి.