IMEI Number: ఫోన్‌ పోయిందా.. 'ఐఎమ్ఈఐ'నెంబర్ గుర్తుందా..!

IMEI Number: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి.

Update: 2022-06-26 10:00 GMT

IMEI Number: ఫోన్‌ పోయిందా.. ‘ఐఎమ్ఈఐ’నెంబర్ గుర్తుందా..!

IMEI Number: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ చోరీలు విపరీతంగా జరుగుతున్నాయి. ఫోన్‌ పోయింది కాదా కంప్లెయింట్‌ ఇద్దామని పోలీస్‌ స్టేషన్‌ వెళితే అక్కడ అందరు అడిగే ప్రశ్న ఫోన్‌ ఐఎమ్‌ఈఐ నెంబర్‌. ఇది స్మార్ట్‌ఫోన్‌ వాడే చాలామందికి తెలియదు. ఈ నెంబర్‌ ఉంటే పోయిన స్మార్ట్‌ఫోన్‌ని గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా ఉంటుంది. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును గుర్తుంచుకోవడం లేదా ఎక్కడైనా సేవ్‌ చేయడం మంచిది. ఫోన్ పోయినప్పుడు ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తునడంలో ఎటువంటి సందేహం లేదు.

ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకునేందుకు సులువైన పద్ధతి ఒకటి ఉంది. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్ 5 లేదా ఆఫై వర్షన్ ఐఫోన్‌ను వాడుతున్నట్లయితే డివైస్ బ్యాక్ ప్యానల్ పై ఐఎమ్ఈఐ నెంబర్‌ను చూడొచ్చు. ఐఫోన్ 4ఎస్ లేదా పాత వర్షన్ ఐఫోన్‌లను వాడుతున్నట్లయితే సిమ్ ట్రే పై ఐఎమ్ఈఐ నెంబర్‌కనిపిస్తుంది.

Tags:    

Similar News