ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, పెట్రోల్ స్కూటర్‌.. లాభనష్టాలని ఒక్కసారి భేరీజు వేయండి..!

Electric Vs Petrol:ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలా వద్దా అనే గందరగోళం చాలా మందిలో నెలకొంది

Update: 2022-07-30 02:59 GMT

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, పెట్రోల్ స్కూటర్‌.. లాభనష్టాలని ఒక్కసారి భేరీజు వేయండి..!

Electric Vs Petrol: ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలా వద్దా అనే గందరగోళం చాలా మందిలో నెలకొంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా పెట్రోల్ స్కూటర్ మధ్య తేడాలు, లాభనష్టాలు తెలుసుకుంటే మీరు ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు అలాంటి విషయాల గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ల నడాపాలంటే పెట్రోల్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్‌పై ఖర్చు చేసే మీ డబ్బును ఆదా చేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్వహణ ఖర్చు పెట్రోల్ స్కూటర్ కంటే చాలా తక్కువ. ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్యం వెదజల్లవు. ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుపై సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. మీరు వాటి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రతికూలతల గురించి చెప్పాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్లతో అతిపెద్ద సమస్య దాని బ్యాటరీ. అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ఇంటిలో ఒక స్థలం అవసరం ఉంటుంది. మీ ఇంట్లో ఈ స్థలం లేకపోతే మీరు ఇబ్బందిపడే అవకాశాలు ఉంటాయి. విద్యుత్తు సరిగా లేని చోట వీటిని ఉపయోగించడం చాలా కష్టం.

పెట్రోల్ స్కూటర్

పెట్రోలు స్కూటర్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈ స్కూటర్లు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయి. ప్రజలు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. పెట్రోల్ స్కూటర్లతో రేంజ్ బెంగ లేదు. అన్ని పెట్రోల్ పంపులు అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కడి నుంచైనా స్కూటర్ ట్యాంక్‌ను రీఫిల్ చేసుకోవచ్చు. స్కూటర్‌ని ఉపయోగించవచ్చు. అదే సమయంలో వీటి ప్రతికూలతల గురించి మాట్లాడితే ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే వీటిని ఉపయోగించడం చాలా ఖరీదైనది. వీటి సర్వీసింగ్ కూడా ఖరీదైనది. అంతేకాదు ఇవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.

Tags:    

Similar News