ChatGPT: ఏవైనా అడుగుతున్నారు గదా.. ఇకపై ఆ ప్రశ్నలకు జవాబు చెప్పదట.. ఎందుకంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది. ఎన్నో పనులు ఎంతో సులభంగా, వేగంగా పూర్తవుతున్నాయి.
ChatGPT: ఏవైనా అడుగుతున్నారు గదా.. ఇకపై ఆ ప్రశ్నలకు జవాబు చెప్పదట.. ఎందుకంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది. ఎన్నో పనులు ఎంతో సులభంగా, వేగంగా పూర్తవుతున్నాయి. అయితే ఇదే టెక్నాలజీ మరోవైపు కొన్ని సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటికే చాలా మందికి ఉద్యోగ నష్టం తలెత్తింది. అంతేకాదు, ప్రతి చిన్న విషయంలోనూ కొంతమంది ఏఐపై పూర్తిగా ఆధారపడుతున్నారు. కొందరు తమ లవ్ బ్రేకప్ విషయాలను, ఎవరిదైనా వ్యక్తిగత సంబంధాల విషయంలో తీసుకోవలసిన నిర్ణయాలను కూడా ఏఐ టూల్స్‌ను అడగడం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చాట్‌జీపీటీ వ్యక్తిగత సంబంధాలపై ప్రత్యక్ష సమాధానాలు ఇవ్వదని సంస్థ ప్రకటించింది. ప్రత్యేకంగా — “లవర్‌తో బ్రేకప్ చెప్పాలా?” లేదా “వీడిపోవాలా?” వంటి ప్రశ్నలకు ఇకపై డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వదని స్పష్టం చేసింది.
ఓపెన్ ఏఐ తాజాగా రూపొందిస్తున్న కొత్త నైతిక ప్రవర్తన నియమావళిలో భాగంగా, చాట్‌జీపీటీ వ్యక్తిగత నిర్ణయాలపై యూజర్లకు తగిన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అంటే, “ఇలా చేయండి” అని చెప్పడం కాదు… యూజర్‌కు ఆలోచించేలా సహాయపడాలి. లాభనష్టాలు ఏమిటో చెప్పాలి. ప్రశ్నలు వేయాలి. చివరికి నిర్ణయం యూజరే తీసుకోవాలి — ఇదే కొత్త దిశ.