Bisleri Mobile App: "బిస్లరీ" మొబైల్ యాప్ లాంచ్.. 24 గంటల్లో వాటర్ క్యాన్ డోర్ డెలివరీ

Update: 2021-12-22 09:48 GMT

Bisleri Mobile App: బిస్లరీ మొబైల్ యాప్ లాంచ్

Bisleri Mobile App: ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ స్వచ్చమైన తాగు నీటిని బాటిల్స్, ప్యాకెట్లలో విక్రయిస్తూ పాపులర్ బ్రాండ్​గా రాణిస్తోంది. బిస్లరీ బ్రాండ్​ తమ బిజినెస్ ని మరింత విస్తరించేందుకు నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. బిస్లరీ​ డైరెక్ట్ టు కన్స్యూమర్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ మొబైల్ అప్లికేషన్‌ ను ప్రారంభించింది. ఈ యాప్​ సహాయంతో వినియోగదారులు ఆన్లైన్ లో నేరుగా వాటర్ క్యాన్లను బుకింగ్ చేసుకునే అవకాశం కలిపించింది. బుకింగ్​​ చేసుకున్న 24 గంటల లోపు డోర్‌ స్టెప్​ విధానంలో వాటర్ క్యాన్లను వినియోగదారుడి ఇంటికే డెలివరీ చేస్తారు.

ఈ యాప్​ను ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ​ డోర్​ డెలివరీ సేవలను హైదరాబాద్​, బెంగుళూరు, అహ్మదాబాద్​, చెన్నైలతో పాటు మరో 26 నగరాల్లో ఈ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. బిస్లరీ మినరల్ వాటర్‌ ను డోర్​ డెలివరీ పొందడం కోసం వినియోగదారులు సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. 4500 డిస్ట్రిబ్యూటర్లతో పాటు 122 ఆపరేషనల్​ ప్లాంటులతో దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో 24 గంటలు మినరల్ వాటర్​ను డెలివరీ చేయనున్నామని.. కొవిడ్​-19 కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్​ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లరీ సీఈవో అంజెలో జార్జ్​ తెలిపాడు.

Tags:    

Similar News