Best Phones Under 15000: 15వేల బడ్జెట్లో వీటిని మించిన ఫోనే లేదు.. టాప్​ మొబైల్స్ ఇవే..!

Best Phones Under 15000: మీరు కొత్త 5జీ ఫోన్ కొనాలని చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ మీకో గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మంత్ ఎండ్ మొబైల్ సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్స్ 5జీ స్మార్ట్‌ఫోన్లను రూ.15000 బడ్జెట్‌లో ఆర్డర్ చేయచ్చు.

Update: 2025-02-22 14:30 GMT

Best Phones Under 15000: 15వేల బడ్జెట్లో వీటిని మించిన ఫోనే లేదు.. టాప్​ మొబైల్స్ ఇవే..!

Best Phones Under 15000: టెక్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. మార్కెట్లో సరికొత్త మోడళ్లు, వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా కాస్త కాస్ట్‌లీగానూ, బడ్జెట్ ఫ్రెండ్లీగా లభిస్తాయి. ఏ బ్రాండ్ చూసినా ఒకే రకమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అందిస్తాయి. మీరు కొత్త 5జీ ఫోన్ కొనాలని చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ మీకో గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మంత్ ఎండ్ మొబైల్ సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్స్ 5జీ స్మార్ట్‌ఫోన్లను రూ.15000 బడ్జెట్‌లో ఆర్డర్ చేయచ్చు. ఈ సేల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. Realme 14x 5G

ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ను రూ. 13,999 ప్రభావవంతమైన ధరతో కొనచ్చు. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP69 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

2. POCO M7 Pro 5G

ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ను రూ. 13,249 ధరతో ఆర్డర్ చేయచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్షన్ 7025 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

3. CMF 1

ఆఫర్లపై ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ రూ. 13,999కి అందుబాటులో ఉంటుది. ఫోన్ మార్చుకోగలిగిన బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

4. Realme 12x 5G

సేల్‌లో ఫోన్ 8+128GB వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. ఇందులో 6.72 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.

Tags:    

Similar News