iPhone 16e: ఖరీదు ఎక్కువని ఐ ఫోన్ కొనలేకపోతున్నారా? రూ.50వేల కంటే తక్కువకే ఐ ఫోన్ ఆఫర్లు పెట్టిన అమెజాన్..!
iPhone 16e: ఐ ఫోన్‌ని కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారా? అయితే ఖరీదు ఎక్కువగని ఆగిపోతున్నారా? అయితే మీకోసం అమెజాన్ బంఫర్ ఆఫర్‌ని తీసుకొచ్చింది.
iPhone 16e: ఖరీదు ఎక్కువని ఐ ఫోన్ కొనలేకపోతున్నారా? రూ.50వేల కంటే తక్కువకే ఐ ఫోన్ ఆఫర్లు పెట్టిన అమెజాన్..!
iPhone 16e: ఐ ఫోన్‌ని కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారా? అయితే ఖరీదు ఎక్కువగని ఆగిపోతున్నారా? అయితే మీకోసం అమెజాన్ బంఫర్ ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఐఫోన్ ధరను భారీగా తగ్గిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. కేవలం ఐ ఫోన్ ధర రూ.50వేల కంటే తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్ 16e ధరను ఇప్పుడు అమెజాన్ రూ.50వేల కంటే తక్కువకు అమ్మనున్నట్టు ప్రకటన చేసింది. అమెజాన్ ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 16e ని తగ్గించడంతో ఇదే అత్యంత చౌకగా వచ్చే ఐ ఫోన్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
అమెజాన్ ఇప్పుడు కొన్ని వస్తువులకు ఆఫర్లు అలాగే భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను పెట్టింది. యాపిల్ ఐఫోన్ 16e ధర రూ.59,900లు. అయితే ఈ ధరను రూ.53,600లకు అంటే 11% తగ్గిస్తూ అమెజాన్ ఇప్పుడు ఈ ఆఫర్‌ని పెట్టింది. దీంతో పాటు బ్యాంకు కార్డులపై రూ.4వేలు తగ్గించింది. మొత్తంగా ఈ ఫోన్ ఇప్పుడు రూ. 49,600లకు లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఐఫోన్ రావడం ఇదే మొదటి సారి.