Amazon Mobile Offer: ఈ ఆఫర్‌ను మిస్ చేయకండి.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.16 వేల డిస్కౌంట్..!

Amazon Mobile Offer: మొబైల్ లవర్స్‌కు హానర్ గుడ్ న్యూస్ చెప్పింది. 'Honor 200 5G' మొబైల్ ప్రస్తుతం 16,000 రూపాయల భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Update: 2025-02-15 06:37 GMT

Amazon Mobile Offer: ఈ ఆఫర్‌ను మిస్ చేయకండి.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.16 వేల డిస్కౌంట్..!

Amazon Mobile Offer: మొబైల్ లవర్స్‌కు హానర్ గుడ్ న్యూస్ చెప్పింది. 'Honor 200 5G' మొబైల్ ప్రస్తుతం 16,000 రూపాయల భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది జూలైలో విడుదలైంది. మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్‌ను మిస్ చేయకండి. ఈ ఫోన్ లాంచ్ ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Honor 200 5G Offers

హానర్ 200 5G ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 34,999కి విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.24,998కే అందుబాటులో ఉంది. అలానే రూ.3,000 కూపన్ తగ్గింపు కూడా అందిస్తోంది. మరోవైపు, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బిసి, ఫెడరల్ బ్యాంక్, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల చెల్లింపులపై రూ. 3,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ అన్నిఆఫర్లతో మీరు హానర్ 200 5G ఫోన్‌ను కేవలం రూ. 18,998కి ఆర్డర్ చేయచ్చు. ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో ఉంది. ఈ ఫోన్‌ని బ్లాక్, మూన్‌లైట్ వైట్ కలర్‌లలో దక్కించుకోవచ్చు.

Honor 200 5G Features

హానర్ 200 5G మొబైల్‌లో 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1200 x 2664 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌లో తయారుచేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మ్యాజిక్ ఓఎస్ 8.0లో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ కోసం ఈ మొబైల్‌లో అడ్రినో 720 GPU కూడా ఉంది.

హానర్ 200 5G ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. OISతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2.5x ఆప్టికల్ జూమ్‌తో 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్‌లో 5200mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, NFC, బ్లూటూత్ v5.3, USB టైప్-C, స్టీరియో స్పీకర్, IR బ్లాస్టర్ ఉన్నాయి.

Tags:    

Similar News