భారత జట్టు ఫీల్డింగ్ పై యువీ ఫైర్

Update: 2019-12-07 13:12 GMT
yuvraj singh

శుక్రవారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్- వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్ లో విండిస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ భారత్ లక్ష్య చేధనలో ఎక్కడ కూడా తడబడకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే విండిస్ అంతలా భారీ స్కోర్ సాధించిడానికి టీమిండియా ఫీల్డింగ్‌ కారణమని స్పోర్ట్స్ విశ్లేషకులు భావించారు.

అయితే ఇప్పుడు ఇదే అంశం పైన భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. మరి ఇంత చెత్త ఫీల్డింగా అని విమర్శించాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లలో చురుకుదనం లేదని కామెంట్‌ చేశాడు. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు ఆలస్యంగా స్పందించారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఫీల్డింగ్‌ చేయలేకపోతున్నారా' అంటూ యువీ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ ముంబైలో జరగనుంది.  


Tags:    

Similar News