ఐసీసీ ప్రపంచకప్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆస్ట్రేలియా సారథి అరోన్ ఫించ్(100: 116 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకంతో మెరిశాడు. డేవిడ్ వార్నర్(53: 61 బంతుల్లో 6ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లతో రాణించగా ఆర్చర్, వుడ్, స్టోక్స్, మొయిన్లు తలో వికెట్ పడగొట్టారు.