Women's T20WC 2020: అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది : కోహ్లి

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ , ఆసీస్ జట్లు ఫైనల్ కి చేరాయి... ఈరోజు సిడ్నీలో ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా

Update: 2020-03-05 16:09 GMT
Anushka sharma and virat kohli

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ , ఆసీస్ జట్లు ఫైనల్ కి చేరాయి... ఈరోజు సిడ్నీలో ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా, గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న కారణంగా ఇండియా ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

ఇక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అయిదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా ఆసీస్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. దీనితో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 ర‌న్స్ చేసింది. అనంతరం లక్ష్య చేధనకి దిగిన సౌతాఫ్రికా వ‌ర్షం అడ్డుపడింది. ఈ నేపధ్యంలో 13 ఓవ‌ర్లలో 98 ర‌న్స్ కి మ్యాచ్ ని కుదించారు. నిర్దేశిత ఓవ‌ర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 92 పరుగులు మాత్రమే చేసింది. దీనితో ఆసీస్ అయిదు పరుగుల తేడాతో గెలిచి భారత్ తో ఫైనల్ లో తలపడనుంది.

అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ ఫైనల్స్‌కు చేరడంతో దీనిపై కొందరు నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలను తప్పుబడుతూ విమర్శల కురిపించారు. అయితే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మహిళల జట్టుకి అభినందనలు తెలుపుతూ.. మార్చి 8న మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నానని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీమిండియా కప్పు గెలవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది.

ఇక దీనిపైన కోహ్లి కూడా స్పందిస్తూ... టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళ జట్టుకు అభినందనలు. అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది' అంటూ పేర్కొన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ భారత్, ఆసీస్ ల మధ్య మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్‌లో జరగనుంది. 


Tags:    

Similar News