ఓటమిని అంగీకరించలేకే దొంగ ఓట్ల డ్రామా -కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Tirupati Lok Sabha By Poll: తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ ఓటమి ఖాయం -కాకాణి

Update: 2021-04-18 10:25 GMT

కాకాని గోవర్ధన్ ఫైల్ ఫోటో

Tirupati Lok Sabha By Poll: తిరుపతి ఉపఎన్నిక తర్వాత అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటలయుద్థం తారాస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేయించారని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే. వైసీపీ వాటిని తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ ఓటమి ఖాయమని, ఆశించినదానికంటే భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి. జగన్‌ పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. ఓటమిని అంగీకరించలేకే చంద్రబాబు దొంగ ఓట్లు డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు కాకాణి.

ఇక తిరుపతి లోక్‌సభా స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా కొనసాగింది. 64.29 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.68 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఆయా పోలింగ్‌ కేంద్రాల నుంచి బందోబస్తు నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఈవీఎంలను తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌కు చేర్చారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్‌రూమ్‌లు 24 గంటలు ఉండనున్నాయి. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలోనే జరుగుతుంది.Babu

Tags:    

Similar News