Suryakumar Yadav : నేను ఫామ్‌లోనే ఉన్నా, బంతే నా బ్యాట్‌ను తాకట్లేదు..సూర్య ధైర్యాన్ని మెచ్చుకోవాలి

ధర్మశాలలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మాత్రం భారత అభిమానులను ఆందోళన పరుస్తోంది.

Update: 2025-12-15 06:00 GMT

Suryakumar Yadav : నేను ఫామ్‌లోనే ఉన్నా, బంతే నా బ్యాట్‌ను తాకట్లేదు..సూర్య ధైర్యాన్ని మెచ్చుకోవాలి

Suryakumar Yadav : ధర్మశాలలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మాత్రం భారత అభిమానులను ఆందోళన పరుస్తోంది. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ బ్యాట్ నుంచి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ వచ్చి 21 ఇన్నింగ్స్‌లు దాటింది. వరుసగా విఫలమవుతున్నప్పటికీ, తాను ఫామ్ కోల్పోలేదని సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో టీ20 తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ధర్మశాలలో జరిగిన మూడో టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ఆయన కేవలం 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి లుంగీ ఎన్గిడి బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో సూర్య బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ చూడాలనే భారత అభిమానుల నిరీక్షణ మరింత పెరిగింది.

గణాంకాలను పరిశీలిస్తే, సూర్యకుమార్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గత 21 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఆయన 13.27 సగటు, 118.90 స్ట్రైక్ రేట్‌తో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2025 సంవత్సరంలో ఆడిన 20 మ్యాచ్‌లలో 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఆయన ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు. ఆయన అత్యధిక స్కోరు 47 నాటౌట్ మాత్రమే. ఈ ప్రదర్శనను చూసి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం సూర్య ఫామ్ టీ20 ప్రపంచ కప్ 2026కు ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడుతున్నారు.

అయితే, తన ప్రదర్శనపై వస్తున్న విమర్శలను సూర్యకుమార్ యాదవ్ అస్సలు పట్టించుకోవడం లేదు. మూడో టీ20 తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నానని పరుగులు రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, తాను ఫామ్ కోల్పోలేదని, కేవలం పరుగులు చేయడం లేదని తేల్చి చెప్పారు. వరుస వైఫల్యాల తర్వాత కూడా తాను ఔట్ ఆఫ్ ఫామ్ కాదని కెప్టెన్ ప్రకటించడం విస్మయం కలిగించే అంశం.

Tags:    

Similar News