Border-Gavaskar Trophy: బాక్సింగ్ డే టెస్ట్‌పై భారీ క్యూరియాసిటీ.. తొలిరోజే హౌజ్ ఫుల్..!
Border-Gavaskar Trophy: బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Border-Gavaskar Trophy: బాక్సింగ్ డే టెస్ట్‌పై భారీ క్యూరియాసిటీ.. తొలిరోజే హౌజ్ ఫుల్..!
Border-Gavaskar Trophy: బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత టీ20 సమయంలో కూడా టెస్ట్ ట్రికెట్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పడానికి ఈ ట్రోఫీ బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు. కాగా ప్రస్తుతం జరుగుతోన్న ఈ సిరీస్‌కు కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ విజయం సాధించడంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ముఖ్యంగా 4వ టెస్ట్‌కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్‌కు ఇంకా 15 రోజులు ఉన్న సమయంలో స్టేడియం నిర్వాహకులు టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. తొలిరోజే ఆటకు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా.. ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇదిలా ఉంటే అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మూడో టెస్టు బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియం వేదికగా జరగనుంది. డిసెంబరు 14న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.