New Zealand vs India 4th T20: మ్యాచ్ టై.. మరో సూపర్ ఓవర్

Update: 2020-01-31 10:49 GMT

వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగి చివరగా మ్యాచ్ టై గా ముగిసింది.166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ గుప్తిల్ (4) బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి కీపర్ కి చిక్కాడు. ఆ తరవాత మరో వికెట్ పడకుండా మన్రో(64), సీఫెర్ట్ జట్టు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద మన్రో అవుట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన టామ్ బ్రూస్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాస్ టేలర్(24) తో జత కట్టిన సీఫెర్ట్ జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్ లో మ్యాచ్ ఉత్కంఠని కలిగించింది. చివరి ఆరు బంతుల్లో ఏడూ పరుగులు అవసరం అనుకున్న క్రమంలో కీవిస్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. దీనితో మ్యాచ్ టై గా ముగిసింది. అంతకు ముందు భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఎనమిది వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇప్పుడు మరో సూపర్ ఓవర్ జరగనుంది. 

Tags:    

Similar News