మలింగకు ఘనంగా వీడ్కోలు

Update: 2019-07-27 02:36 GMT

శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు వీడ్కోలు పలికాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బంగ్లాతో శుక్రవారం తన చివరి వన్డేను ఆడాడు. దిగ్గజ బౌలర్ లసిత్ మలింగకు శ్రీలంక జట్టు గెలుపుతో వీడ్కోలు పలికింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో లంక 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. కుశాల్‌ పెరీర (111) శతకం బాదగా అటు మలింగ బౌలింగ్‌లో చెలరేగి మూడు వికెట్లతో రాణించి తన చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు చేసింది. షఫీయుల్‌ ఇస్లామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆతర్వాత భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన బంగ్లా జట్టు 41.4 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (67), సబ్బీర్‌ రహమాన్‌ (60) అర్ధసెంచరీలు చేశారు. నువాన్‌ ప్రదీ్‌పకు మూడు, ధనంజయకు రెండు వికెట్లు దక్కాయి.

మలింగ వన్డే కెరీర్‌

226 వన్డేల్లో 338 వికెట్లు

బౌలింగ్‌ సగటు 28.87

అత్యధిక వికెట్ల జాబితాలో 9వ స్థానం

అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 6/38

Tags:    

Similar News