Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రానే నెం. 1 టెస్ట్ క్రికెటర్ - ఐసిసి

Jasprit Bumrah Test cricket career: జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వార్తల్లోకెక్కాడు. 2024 ఏడాదిలో టెస్ట్ క్రికెట్ లో పర్ ఫార్మెన్స్ ఇరగదీసిన క్రికెటర్ గా ఐసిసి బుమ్రా పేరును ప్రకటించింది.

Update: 2025-01-27 10:43 GMT

Jasprit Bumrah Test cricket career: జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వార్తల్లోకెక్కాడు. 2024 ఏడాదిలో టెస్ట్ క్రికెట్‌లో పర్‌ఫార్మెన్స్ ఇరగదీసిన క్రికెటర్‌గా ఐసిసి బుమ్రా పేరును ప్రకటించింది. ఐసిసి జస్‌ప్రీత్ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ప్రకటిస్తూ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు చేసింది. ఈ అవార్డ్ అందుకున్న తొలి ఇండియన్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రానే కావడం మరో హైలైట్. 

2024 లో జస్‌ప్రీత్ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన రేటింగ్‌తో అత్యధిక వికెట్స్ తీసి బౌలర్లలో తనే నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టి ఆసిస్ ఆటగాళ్లను కంగారు పెట్టాడు.

ఈ రేసులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిండు మెండిస్ వంటి ఆటగాళ్లు బుమ్రా కంటే వెనుకబడిపోయారు. ఆ టాప్ క్రికెటర్స్‌ను వెనక్కు నెడుతూ 2024 లో మెరుగైన పర్‌ఫార్మెన్స్ అందించిన టెస్ట్ క్రికెటర్‌గా ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.  

గతంలో ఇండియన్ క్రికెటర్స్‌లో ఎవరెవరికి టెస్ట్ క్రికెటర్ అవార్డ్ వచ్చిందంటే..

జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు గతంలో ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్న వారి జాబితాలో ఐదుగురు క్రికెటర్స్ ఉన్నారు. రాహుల్ ద్రావిడ్, గౌతం గంభీర్, వీరేంద్ర సేహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు వారి కెరీర్ పీక్‌ దశలో ఉన్నప్పుడు ఐసిసి ఈ అవార్డ్ ప్రకటించింది. 

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. దయచేసి పేజ్ రిఫ్రెష్ చేయగలరు.  

Tags:    

Similar News