BCCIకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ ఈ-వేలం

IPL e-auction: *తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్లు

Update: 2022-06-13 02:54 GMT

BCCIకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ ఈ-వేలం 

IPL e-auction: IPL మీడియా ప్రసార హక్కుల కోసం ప్రారంభించిన వేలం BCCIకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం ఈ-వేలం ప్రారంభంకాగా..తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్ల రూపాయలు పలికింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా..ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా. 2023-27 ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం ఈ వేలం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే అంతా ఊహించినట్లుగానే భారీగా స్పందన వచ్చింది. వేలంకు బీసీసీఐ కనీస ధరను 32వేల, 440 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా..తొలి రోజే దాని ధర అంతకంతకు 10వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017లో స్టార్ ఇండియా 2018-22 సీజన్ కోసం టీవీ, డిజిటల్ ప్రసారాలకు కలిపి 16వేల, 347 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు కాగా..ఈసారి అంతకు మూడు రెట్లు ఎక్కువ సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News