IPL 2020 Updates: అదరగొట్టిన రో'హిట్ '..కోల్ కతా విజయ లక్ష్యం 196

IPL 2020 Updates : కోల్కతా తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి 195 పరుగులు చేసింది.

Update: 2020-09-23 16:46 GMT

రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. కోల్కతా బౌలర్లపై చెలరేగిపోయాడు. అతనికు సూర్యకుమార్ తోడయ్యాడు. దాంతో పరుగులు సులభంగా వచ్చాయి. చివర్లో రోహిత్ అవుట్ అవడంతో కొద్దిగా పరుగుల వేగం తగ్గింది. ఒక దశలో 200 దాటిపోతుందనుకున్న ముంబాయి స్కోరు 195 పరుగులకు పరిమితమైంది. ఐపీఎల్ 2020 లో ఐదో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన గౌరవప్రదమైన స్కోరు చేసి..ముంబాయి ముందు 196 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

రోహిత్ సేన ఇన్నింగ్స్ సాగింది ఇలా..

* సందీప్ వేసిన మొదటి ఓవర్లో చివరి బంతిని సిక్సర్ బాది రోహిత్ శర్మ తన దూకుడు గ్యారెంటీ అని చెప్పాడు.

* రెండో ఓవర్లోనే ముంబయి కి దెబ్బతగిలింది. వమ్‌ మావి బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి డికాక్‌ (1) నిఖిల్‌ చేతికి చిక్కాడు.

* సూర్యకుమార్ డికాక్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. సందీప్‌ వారియర్‌ వేసిన మూడో ఓవర్ లో సూర్యకుమార్‌ బౌండరీల మోత మోగించాడు. వరుసగా నాలుగు బౌండరీలు సాధించాడు. దీంతో మూడు ఓవర్లకు ముంబయి స్కోరు 24/1

* కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్ 5 వ ఓవర్లో రోహిత్ చెలరేగాడు. రెండు సిక్స్ లు బాదేశాడు. దీంతో 5 ఓవర్లకు 48 పరుగులు చేసింది ముంబయి

* సూర్యకుమార్ ను అడ్డుకోవడానికి కోల్కతా కెప్టెన్ బౌలర్లను మార్చినా ఫలితం దొరకలేదు. కులదీప్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమేదో వోవర్లో సూర్యకుమార్ డీప్‌ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు.

* పదకొండో ఓవర్లో ముంబయి మరో వికెట్ కోల్పోయింది. చక్కగా ఆడుతున్న సూర్యకుమార్ రనౌట్ అయ్యాడు. అతని స్థానంలో సౌరభ్ తివారి వచ్చాడు.

* పన్నెండో ఓవర్లో కులదీప్ వేసిన ఆఖరు బంతికి రోహిత్ రెండు పరుగులు చేశాడు. దీంతో రోహిత్‌శర్మ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లోనే ముంబాయి స్కోరు 100 పరుగులు దాటింది.

* 14 వ ఓవర్లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో రోహిత్ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా, లాంగ్‌ ఆన్‌ మీదుగా భారీ సిక్సర్లు‌ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి.

* కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్లో సౌరభ్ వరుసగా ఫోర్‌,‌ సిక్సర్‌ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో15 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు 147/2.

* నరైన్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 16 వ ఓవర్ మొదటి బంతికి సౌరభ్‌ భారీ షాట్‌కు యత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు.

* ఈదశలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్‌ పాండ్య ఇన్నింగ్స్ 17 వ ఓవర్లో కమిన్స్ ను బౌండరీలతో ఆదుకున్నాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. దీంతో ముంబయి 167/3 స్కోరు వద్ద నిలిచింది.

* శివం మావి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రోహిత్ (80) భారీ షాట్ కు ప్రయత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు. 18ఓవర్లకు ముంబయి 178/4.

* తరువాతి ఓవర్లో రసెల్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ (18) హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు.

* శివమ్‌ మావి వేసిన ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లకు ముంబయి జట్టు 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ స్కోరు కార్డు

195/5 (20.0 ఓవర్లు), CRR: 9.75 RPO క్వింటన్ డి కాక్ 1 (3) రోహిత్ శర్మ 80 (54) సూర్యకుమార్ 47 (28) సౌరభ్ తివారీ 21 (13) హార్దిక్ పాండ్యా 18 (13) పొలార్డ్* 13 (7) క్రునాల్ పాండ్యా* 1 (3)

https://www.hmtvlive.com/live-updates/ipl-2020-match-4-live-updates-and-live-score-mi-vs-kkr-ipl-2020-updates-live-score-mumbai-indians-vs-kolkata-knight-riders-match-5-rohit-sharma-vs-dinesh-karthik-53754

Tags:    

Similar News