IPL 2020: వాతావ‌ర‌ణ‌మే అస‌లైన స‌మ‌స్య: ట్రెంట్‌ బౌల్ట్

IPL 2020: ఐపీఎల్‌లో ప్రత్యర్థి కంటే యూఏఈలోని క‌ఠిన‌‌ వాతావరణమే అస‌లైన స‌మ‌స్య అని ముంబయి ఇండియన్స్ ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్ అన్నారు.

Update: 2020-09-15 09:18 GMT

Trent Boult

IPL 2020: ఐపీఎల్‌లో ప్రత్యర్థి కంటే యూఏఈలోని క‌ఠిన‌‌ వాతావరణమే అస‌లైన స‌మ‌స్య అని ముంబయి ఇండియన్స్ ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్ అన్నారు. యూఏఈలోని వాతావ‌రణంలో బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదనీ, ప్రస్తుతం దుబాయిలో ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలగా రిక్డారు అవుతుంది. అయితే, 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి వచ్చిన తనలాంటి ఆటగాళ్లకు ఇది కొంచెం క్లిష్టమైన సవాల్‌ అని అంటున్నాడు.

ఇంతకు ముందు దుబయ్‌లో ఆడిన అనుభవం తనకు ఉందన్న బౌల్ట్‌.. ఈ విషయంలో కంగారు పడకుండా శారీరకంగా సిద్ధం కావాలన్నాడు. తాను కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. ముంబై తరఫున ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ జ‌ట్టులో అనుభ‌వ‌జ్ఞులైన ఆట‌గాళ్లు ఉన్నారు. అలాగే మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టులో బౌలర్‌గా ఉండటం నాకు సానుకూలాంశం. ఇక్కడి పిచ్‌లు బాగుండాలని కోరుకుంటున్నా' అని అన్నాడు. ఈ మ‌ధ్య‌కాలంలో నెట్స్‌లో ఫుల్ స్టీమ్‌తో ట్రెంట్‌ బౌల్ట్ విసిరిన ఓ బంతికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

మరో నాలుగు రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 19న అబుదాబీ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్‌ కోచ్ మహేల జయవర్ధనే పర్యవేక్షణలో ఆ జట్టు ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిచి తమకు తిరుగులేదని రోహిత్ శర్మ చాటిచెప్పాలని అనుకుంటున్నారు.  

Tags:    

Similar News