IPL 2020: రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్...

IPL 2020: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్లులు కైవసం చేసుకున్న భారత ఆటగాడిగా నిలిచాడు.

Update: 2020-09-24 05:42 GMT

IPL 2020: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కైవసం చేసుకున్న భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(21), డివిలేయర్స్(20), రోహిత్ శర్మ(18), ధోని(17), షేన్ వాట్సన్(17), డేవిడ్ వార్నర్(17), యూసఫ్ పఠాన్ (17) ఉన్నారు. అటు రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే.. ఐపీఎల్ లో 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో 200 సిక్స్ ల క్లబ్ లో చేరాడు. నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఈ ఫ్రీట్ సాధించాడు. అత్యధిక సిక్స్ ల జాబితాలో క్రిస్ గేల్ (326) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత ఏబీ డేవిలేర్స్ (214), ఎంఎస్ ధోని (212) తో ఉన్నారు.. ఈ వరుసలో రోహిత్ కుడా చేరాడు..

బుధవారం నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాట్టింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో చెలరేగడంతో కోల్‌కతా జట్టుకు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి రెండు వికెట్లు, నరైన్‌, రసెల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 196 పరుగుల చేధన కు బరిలో దిగిన నైట్ రైడర్స్ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుతుందనిపించలేదు. ఏవో కొన్ని మెరుపులు తప్ప ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ ప్రయత్నాలు కనిపించలేదు. ఈ మ్యాచ్ గెలవడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో భోణీ కొట్టింది. 

Tags:    

Similar News