IPL 2020: ధోనీ అరుదైన ఘ‌న‌త‌!

IPL 2020: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో అబుదాబి వేదికగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుండగా.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ ఘ‌న‌త సాధించాడు

Update: 2020-10-19 14:54 GMT

MS Dhoni creates history

IPL 2020: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డ్‌ని అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో అబుదాబి వేదికగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుండగా.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ ఘ‌న‌త సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిధ్యం వహించిన అతడు పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా చెన్నై జట్టును రెండేళ్లు నిషేధించడంతో 2016, 2017 సీజన్‌లో ధోనీ పుణె తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని కెప్టెన్‌గా ఆడి జట్టుకు అతడు మూడు టైటిళ్లు సాధించాడు. ప్ర‌తి సారి ప్లేఆఫ్‌కి చేర్చారు. తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన చెన్నై ఆరింట్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సి ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ధోనీ 199 మ్యాచ్‌లాడిన 4,568 పరుగులు చేయగా.. ఇందులో చెన్నై టీమ్ తరఫున ఆడుతూ 3,994, రైజింగ్ పుణె టీమ్‌కి ఆడుతూ 574 పరుగులు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో 169 మ్యాచ్‌లాడిన చెన్నై టీమ్ ఏకంగా 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం గమనార్హం. ఐపీఎల్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (197), సురేశ్ రైనా (193), దినేశ్‌ కార్తీక్ (191), విరాట్ కోహ్లీ (186) వరుసగా ఉన్నారు.

Tags:    

Similar News