IPL 2020 Match 12 Updates : కోల్‌కతా బౌలింగ్ లో రాజస్థాన్ విల విల! రాయల్ పరాజయం!

IPL 2020 Match 12 Updates : కోల్‌కతా బౌలర్లు విరుచుకుపడిన వేళ..రాజస్థాన్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేసి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో 37 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.

Update: 2020-09-30 18:07 GMT

ఉరుములు.. మెరుపులు కాదు కదా.. పట్టుమని పాతిక పరుగులు చేయాలనీ రాజస్థాన్ బ్యాట్స్ మెన్ భావించినట్టు కనిపించలేదు. అతి పేలవంగా..నిర్లక్ష్యంగా.. ఏమాత్రం పస లేకుండా వారి బ్యాటింగ్ సాగింది. అందుకు తగ్గ ఫలితం ఓటమి రూపంలో దక్కింది. రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం పెద్దది ఏమీ కాదు. 175 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకోవడానికి ఆపసోపాలు పడి.. 37 పరుగుల వెనుక బడి ఓటమి పాలైంది.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సాగింది ఇలా..

* రెండో ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో స్మిత్ (3)‌ ఔటయ్యాడు. షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్ కార్తీక్‌ చేతికి చిక్కాడు. 2 ఓవర్లకు రాజస్థాన్‌ 15/1.

* శివమ్‌ మావి బౌలింగ్‌లో శాంసన్‌ (8) షాట్‌కు యత్నించి నరైన్‌ చేతికి చిక్కాడు. 5 ఓవర్లకు రాజస్థాన్ 30/2

* రాజస్థాన్‌ కీలక వికెట్‌ కోల్పోయింది. శివమ్‌ మావి బౌలింగ్‌లో బట్లర్ (21)‌ షాట్‌కు యత్నించి చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లకు రాజస్థాన్‌ 41/3

* ఎనిమిదో ఓవర్లో రెండు వికెట్లు ..నాగర్‌కోటి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఉతప్ప (2) శివమ్‌ మావి చేతికి చిక్కాడు. నాలుగో బంతికి పరాగ్‌ (1)ను బోల్తా కొట్టించాడు. షాట్‌కు యత్నించిన పరాగ్ గిల్‌ చేతికి చిక్కాడు. 8 ఓవర్లకు రాజస్థాన్ 43/5

* గత మ్యాచ్‌ సిక్సర్ల హీరో తెవాతియా (13) కోల్‌కతాపై తొలి సిక్సర్‌ సాధించాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. 10 ఓవర్లకు రాజస్థాన్‌ 61/5

* వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తెవాతియా (24) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11 ఓవర్లకు రాజస్థాన్‌ 67/6.

* రాజస్థాన్‌ ఏడో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో శ్రేయస్ గోపాల్ (5) వికెట్‌ కీపర్‌ కార్తీక్ చేతికి చిక్కాడు. 14 ఓవర్లకు రాజస్థాన్‌ 81/7.

* 15 వ ఓవర్లో రాజస్థాన్‌ మరో వికెట్ కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జోఫ్రా (6) నాగర్‌కోటి చేతికి చిక్కాడు. అతడికి దూరంగా గాల్లోకి లేచిన బంతిని నాగర్‌కోటి అద్భుతంగా దూకి అందుకున్నాడు. 15 ఓవర్లకు రాజస్థాన్‌90/8.

* కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఉనద్కత్‌ (9) భారీ షాట్‌కు యత్నించి నాగర్‌కోటి చేతికి చిక్కాడు. 18 ఓవర్లకు కోల్‌కతా 106/9

* నరైన్‌ బౌలింగ్‌లో టామ్‌ కరన్ (50)‌ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో 35 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు రాజస్థాన్‌ 126/9

* కుల్‌దీప్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. రాజస్థాన్‌పై కోల్‌కతా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.  

Tags:    

Similar News