IPL 2020: మ‌రో సారి గర్జించిన గ‌బ్బ‌ర్.. పంజాబ్ ల‌క్ష్యం 165

IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు

Update: 2020-10-20 16:07 GMT

IPL 2020: ఐపీఎల్‌ 2020 టోర్నీలో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ప్రత్య‌ర్ధి బౌల‌ర్ల‌పై గ‌ర్జించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలారేగాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ చరిత్ర సృష్టించాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు.

దాంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ధావన్ త‌ప్ప‌ మిగతా బ్యాట్స్‌మన్‌ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (14).. హిట్టర్లు రిషబ్ పంత్ (14), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (10) పూర్తిగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్ పేసర్ మొహమ్మద్ షమీ తన కోటా 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

Tags:    

Similar News